📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

TamilNadu: తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగనున్న అన్నామలై

Author Icon By Anusha
Updated: April 5, 2025 • 10:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అన్నామలై తన పదవి నుంచి తప్పుకుంటునట్టు ప్రకటించారు. మరోసారి అధ్యక్ష పదవికి తాను పోటీ చేయబోనని స్పష్టం చేశారు.అందరితో చర్చించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని అన్నారు. తమిళనాడు బీజేపీలో చాలామంది సమర్ధుల నేతలు ఉన్నారని అన్నారు. గత కొంతకాలంగా అన్నామలైని బీజేపీ అధ్యక్ష పదవి నుంచి హైకమాండ్‌ తొలగిస్తుందని ప్రచారం జరుగుతోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ పిద్దమవుతోంది. అన్నాడీఎంకేతో పొత్తు కోసమేయ అన్నామలైని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది. రెండు పార్టీల మధ్య పొత్తుకు అన్నామలై ఆటంకంగా మారారన్న వార్తలు వచ్చాయి. దీంతో తాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకునేందుకు రెడీగా ఉన్నట్టు అన్నామలై పార్టీ హైకమాండ్‌కు సమాచారం ఇచ్చారు.

పళనిస్వామి భేటీ

ఢిల్లీలో అమిత్‌షాతో అన్నాడీఎంకే నేత పళనిస్వామి భేటీ తరువాత తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. బీజేపీకి అన్నాడీఎంకే దగ్గరవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే పళనిస్వామి, అన్నామలై ఇద్దరు కూడా గౌండర్‌ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే ,దీంతో సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని అన్నామలై స్థానంలొ కొత్త నేతను నియమించాలన్న ఆలోచన బీజేపీ హైకమాండ్‌కు వచ్చింది. ఇద్దరు కూడా కొంగు నాడు ప్రాంతంలో పట్టున్న నేతలే కాకపోతే పళనిస్వామి ఎన్డీఏ కూటమి సీఎం అభ్యర్ధిగా త్వరలో ప్రకటించే అవకాశాలున్నాయి.

ఎన్డీఏ కూటమి

అన్నామలై తీరుతోనే 2023లో ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే దూరమయ్యింది. దివంగత మాజీ సీఎం జయలలితపై అన్నామలై అనుచిత వ్యాఖ్యలు చేశారని అప్పట్లో భారీ ఆందోళన చేపట్టారు అన్నాడీఎంకే కార్యకర్తలు. అందుకే తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి అన్నామలైని తొలగిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి.

భారతదేశంలో చాలా రాష్ట్రాలున్నాయి కానీ అన్నింటికన్నా తమిళనాడు రాజకీయాలు చాలా ప్రత్యేకం. అక్కడ స్థానిక పార్టీలదే హవా జాతీయ పార్టీలకు చోటులేదు. అలాంటిరాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేయడానికి చాలా ప్రయత్నించాడు అన్నామలై. అతడు అధ్యక్ష బాధ్యతలు చేపట్టినతర్వాతే బిజెపి శ్రేణుల్లో ఊపు వచ్చిందని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు.గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇతడి నాయకత్వంలోనే తమిళ బిజెపి పోటీచేసింది. అయితే ఈ ఎన్నికల్లో తమిళనాడులో బిజెపి కనీసం ఒక్కసీటు కూడా సాధించలేకపోయింది.చివరకు ఆయనే పోటీచేసి ఓడిపోయారు. ఇదే ఆయనను అధ్యక్ష పదవినుండి తప్పించడానికి కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అన్నామలై నుండి అధ్యక్ష పగ్గాలు లాక్కోడానికి ఏఐఏడిఎంకే (అన్నాడిఎంకే) కూడా ఓ కారణంగా తెలుస్తోంది. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, అన్నాడిఎంకే కలిసి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే ఇరుపార్టీల ముఖ్యనేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి.అన్నాడిఎంకే నాయకుడు పళనిస్వామి బిజెపి అగ్రనేత అమిత్ షాతో భేటీ కూడా అయ్యారు. ఈ క్రమంలోనే తమిళనాడు బిజెపి అధ్యక్షుడిగా అన్నామలై ఉంటే పొత్తు కష్టమని ఆయనను తొలగించాలని అన్నాడిఎంకే కోరినట్లు తెలుస్తోంది. అందువల్లే అన్నామలైని తప్పుకోవాలని బిజెపి అదిష్టానం కోరినట్లు తెలుస్తోంది. వారి ఆదేశాలతోనే ఆయన అధ్యక్ష పదవిని వదులుకుంటున్నట్లు సమాచారం.

#Annamalai #BJPLeadershipChange #BJPUpdates #IndianPolitics #PoliticalNews #tamilnadupolitics Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.