📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

కాంగ్రెస్ ప్రభుత్వం పై బండి సంజయ్ కీలక ఆరోపణలు

Author Icon By Sudheer
Updated: October 24, 2024 • 3:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్.. మూసీ నిర్వాసితుల ఇళ్ల కూల్చివేతను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.మీడియాతో మాట్లాడుతూ.. “కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటీఎంలా మార్చుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నదిని కూడా ఏటీఎంలా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోంద”ని విమర్శించారు.

మూసీ ప్రక్షాళన పేరుతో పరివాహక ప్రాంతంలోని నిరుపేదల ఇళ్లను కూల్చివేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వానికి మూసీ ప్రాజెక్టు పేరుతో లక్షన్నర కోట్ల రూపాయల అప్పు తీసుకోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, “వడ్డీల రూపంలో పది నెలల్లోనే రూ.60 వేల కోట్లు చెల్లించామని” వివరించారు. “పాలకులు చేస్తున్న అప్పుల కారణంగా రాష్ట్రంపై, ప్రజలపై భారం పడుతోంది” అని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు సహా హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని చెప్పారు.

బీజేపీ మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకంగా లేదని, అయితే “ఈ ప్రభుత్వ దోపిడీ, హైడ్రా పేరుతో పేదల ఇళ్ల కూల్చివేతకు మాత్రం తాము వ్యతిరేకమ”న్నారు. ఈ పరిస్థితులను నిరసిస్తూ రేపు ఇందిరా పార్క్ వద్ద పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టనున్నట్లు వెల్లడించారు.

Bandi sanjay Congress govt musi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.