నకిలీ సర్టిఫికెట్ తో కోర్ట్ ను మోసగించిన అనిల్‌కుమార్

నకిలీ సర్టిఫికెట్ తో కోర్ట్ ను మోసగించిన అనిల్‌కుమార్

చంద్రబాబునాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్ట్ అయిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌కుమార్ హైకోర్టును తప్పుదోవ పట్టించిన విషయం వెలుగులోకి వచ్చింది. తన తల్లి పద్మావతి అనారోగ్యంతో బాధపడుతున్నారని పేర్కొంటూ తప్పుడు మెడికల్ సర్టిఫికెట్ సమర్పించి మధ్యంతర బెయిలు పొందిన విషయం తాజాగా బయటపడింది.

Advertisements

మధ్యంతర బెయిలు

అనంతపురంలో నమోదైన కేసులో రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ.. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమెను చూసేందుకు మధ్యంతర బెయిలు ఇవ్వాలని కోరుతూ గత నెల 14న హైకోర్టులో పిటిషన్ వేశాడు. కోర్టు దీనిని పరిగణలోకి తీసుకుని, ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. ఈ గడువు ముగిసిన తర్వాత 28న సాయంత్రం అతడు తిరిగి లొంగిపోయాడు.మార్చి 1న బోరుగడ్డ హైకోర్టులో మరో పిటిషన్ వేస్తూ మధ్యంతర బెయిలును పొడిగించాలని అభ్యర్థించాడు. తల్లికి తాను ఒక్కడినే కుమారుడినని, ఆమె చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, మరో రెండు వారాల పాటు చికిత్స అవసరమని పేర్కొన్నాడు. గుంటూరులోని లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పీవీ రాఘవశర్మ ఇచ్చినట్టుగా ఒక మెడికల్ సర్టిఫికెట్‌ను సమర్పించాడు.

మెడికల్ సర్టిఫికెట్

పోలీసుల తరపున వాదనలు వినిపించిన ఏపీపీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, బోరుగడ్డ సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్ వాస్తవమా కాదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చింది. తప్పుడు ధ్రువీకరణ పత్రం అయితే చర్యలు తప్పవని హెచ్చరించుతూ, మార్చి 11 వరకు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది.

FVK 18c2f32d70 v jpg

పోలీసుల విచారణ

పోలీసుల విచారణలో బోరుగడ్డ సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్ నకిలీదని తేలింది. పద్మావతి చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందడం నిజమే అయినా, ఆమె ఫిబ్రవరిలోనే డిశ్చార్జ్ అయినట్టు గుర్తించారు. దీంతో లలిత ఆసుపత్రి వైద్యులను సంప్రదించగా, వారు అలాంటి సర్టిఫికెట్ ఇవ్వలేదని, పద్మావతి తమ వద్ద చికిత్స పొందలేదని తెలిపారు. ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పీవీ రాఘవశర్మ కూడా తాము అలాంటి మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వలేదని స్పష్టం చేశారు.

న్యాయస్థానం

తప్పుడు సర్టిఫికెట్‌తో కోర్టును మోసగించిన అనిల్ వ్యవహారాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆయనపై మరో కేసు నమోదు చేయాలని యోచిస్తున్నారు. కాగా, తప్పుడు సర్టిఫికెట్‌తో కోర్టును మోసగించిన బోరుగడ్డ ఎక్కడ ఉంటున్నాడు? ఏం చేస్తున్నాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Related Posts
అందర్నీ నవ్వుల్లో ముంచేసిన సీఎం చంద్రబాబు
babu balayya

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా, ఆయన గౌరవార్థం నారా భువనేశ్వరి ప్రత్యేక విందు ఏర్పాటు Read more

తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్
State Labor Minister Vasams

తిరుపతి : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తిరుపతిలోని ఈ ఎస్ ఐ హాస్పిటల్ని అకస్మాతుగా శుక్రవారం తనిఖీ చేసారు. అదేవిధంగా హాస్పటల్ లో Read more

తెనాలిలో సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Krishna statue unveiled in

గుంటూరు జిల్లా తెనాలిలో దివంగత నటుడు, సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహం ఆవిష్కరించబడింది. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, నిర్మాత ఆదిశేషగిరిరావు పాల్గొని విగ్రహాన్ని Read more

Sarada Peetham : శారదా పీఠానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ
శారదా పీఠానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ

Sarada Peetham : శారదా పీఠానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ విశాఖపట్నంలో ఉన్న శారదా పీఠానికి తాజాగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ Read more

×