బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా గుడ్ న్యూస్ చెప్పారు.త్వరలోనే తాము తల్లిదండ్రులము కాబోతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.”మా జీవితానికి సంబంధించిన అద్భుతమైన బహుమతి త్వరలోనే రానుంది” అంటూ బేబీ ఎమోజీని షేర్ చేశారు.
శుభవార్త
గత నెలలో కియారా ఆరోగ్యం గురించి కొన్ని వదంతులు వినిపించాయి. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిందన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అందుకే ‘గేమ్ ఛేంజర్’ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిందని టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఇప్పుడు ఈ గుడ్ న్యూస్‌తో ఆమె అభిమానుల్లో ఆనందం నెలకొంది.
తల్లి కానున్న కియారా
కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా జంట 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లో వైభవంగా వివాహం చేసుకుంది. ‘షేర్షా’ సినిమా సెట్స్‌లో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ ప్రేమకథ 2019లో మొదలై, 2021లో ఇద్దరు తమ కుటుంబ సభ్యులను కలుసుకుని సంబంధాన్ని అధికారికంగా మార్చుకున్నారు. ఇటీవలే తమ రెండో వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న ఈ జంట, ఇప్పుడు తల్లిదండ్రులుగా మారబోతున్నట్లు ప్రకటించారు.

ప్రయాణం
కియారా 2014లో ‘ఫగ్లీ’ సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. కానీ ఆమెకు గుర్తింపు తెచ్చిన చిత్రం ‘ఎం.ఎస్.ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ (2016). తర్వాత షాహిద్ కపూర్‌తో కలిసి చేసిన ‘కబీర్ సింగ్’ సినిమాతో భారీ స్టార్‌డమ్‌ను సాధించింది. అలాగే, సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘షేర్షా’ చిత్రంలో నటించి, ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.కియారా, సిద్ధార్థ్ లు తల్లిదండ్రులు కాబోతున్నారని తెలియగానే బాలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియాలో వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఈ వార్త వైరల్ అవుతోంది.
‘షేర్షా’ సినిమా సెట్స్‌లో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇటీవలే వారు తమ రెండవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. రెండేళ్ల పెళ్లయిన తర్వాత కియారా శుభవార్త చెప్పింది.కియారా, సిద్ధార్థ్ తొలిసారి ‘లస్ట్ స్టోరీస్’ సినిమా ముగింపు పార్టీలో కలిశారు. ఈ పరిచయం మొదట స్నేహంగా, ఆ తర్వాత క్రమంగా ప్రేమగా మారింది. 2019 లో, ఇద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత 2021లో, కియారా , సిద్ధార్థ్ ఒకరి కుటుంబాలను ఒకరు కలుసుకున్నారు.