Being in the opposition is not new to us.. YS Jagan

ప్రతిపక్షంలో ఉండటం మనకి కొత్త కాదు : వైఎస్‌ జగన్‌

అమరావతి: కూటమి సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 10 నెలలు గడుస్తోందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. చదువు, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్‌గానీ ఇలా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని చెప్పుకొచ్చారు.ఏడాది అవుతున్నా ఫీజు రీయంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో కాలేదన్నారు.

image

ప్రజల కష్టాల నుంచి పార్టీ పుట్టింది

వైసీపీ పార్టీ ఆవిర్భవించి మార్చి 12 నాటికి(బుధవారం) సరిగ్గా 15 ఏళ్లు అయ్యాయి. ఈ సందర్భంగా తాడేపల్లి నివాసం ఆవరణలో పార్టీ జెండాను ఆవిష్కరించారు జగన్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తమ పార్టీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. ప్రతిపక్షంలో కూర్చోవడం పార్టీకి కొత్తేమీ కాదన్నారు. ప్రజల కష్టాల నుంచి పార్టీ పుట్టిందని, వారి గురించి పోరాడుతోందన్నారు. అధికారంలో ఉన్నవాళ్లకు ఎప్పటికప్పుడు ధీటుగా సమాధానం ఇస్తున్నామని చెప్పారు.

మూడు లేదా నాలుగేళ్లు తర్వాత మళ్లీ అధికారంలోకి

మనం చెప్పామంటే చేస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు వైసీపీ అధినేత. ఇవాళ ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లే స్థితిలో మన పార్టీ, కార్యకర్తలు ఉన్నారని చెప్పుకొచ్చారు. మూడు లేదా నాలుగేళ్లు తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమేనని నేతలను, కేడర్‌ని ఉత్సాహపరిచే మాటలు చెప్పారాయన. రాజకీయాల్లో నైతిక విలువలను చాటి చెప్పిన జగన్‌, నేను విన్నాను.. నేను ఉన్నానంటూ ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Related Posts
రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్టార్ అథ్లెట్
Dipa Karmakar

రియో ఒలింపిక్స్-2016లో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్న భారత స్టార్ జిమ్నాస్టిక్ అథ్లెట్ దీపా కర్మాకర్ రిటైర్మెంట్ ప్రకటించారు. 2011 నేషనల్‌ గేమ్స్‌లో నాలుగు ఈవెంట్లలో గోల్డ్ Read more

తెలంగాణ లోని జిల్లాలకు BJP అధ్యక్షులు వీరే
telangana bjp

తెలంగాణ రాష్ట్రంలో భాజపా (BJP) తన శక్తిని మరింత పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. 27 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం అధికారిక ప్రకటన Read more

OG మూవీలో అకీరా నందన్..?
akira og

పవన్ కళ్యాణ్ - సుజిత్ కలయికలో 'OG' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో తెలియంది కాదు..కేవలం ఫస్ట్ లుక్ Read more

Donald Trump: మళ్ళీ దేశాలకు ట్రంప్ వార్నింగ్..ఈ సారి ఏ విషయంలో అంటే!
మళ్ళీ దేశాలకు ట్రంప్ వార్నింగ్..ఈ సారి ఏ విషయంలో అంటే!

వెనెజులా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఆ దేశం నుంచి చమురు కానీ, గ్యాస్ Read more