Begumpet railway station to be inaugurated soon.. Kishan Reddy

Kishan Reddy : త్వరలోనే బేగంపేట రైల్వే స్టేషన్‌ను ప్రారంభం: కిషన్‌రెడ్డి

Kishan Reddy : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్‌తో కలిసి బేగంపేట రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రైల్వేలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు. త్వరలోనే బేగంపేట రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. మరో పది శాతం పనులు పూర్తికావాల్సి ఉందని వివరించారు. విమానాశ్రయాల తరహాలో రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం వివిధ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోందని అన్నారు.

త్వరలోనే బేగంపేట రైల్వే

దశలవారీగా అభివృద్ధి పనులను పూర్తి

బేగంపేట రైల్వేస్టేషన్‌లో అందరూ మహిళలే ఉద్యోగులు ఉండేలా చూస్తాం. రూ.26.55 కోట్లతో మొదటివిడత పనులు జరుగుతున్నాయి. మరో రూ.12 కోట్లతో రెండోవిడత పనులు పూర్తి చేస్తాం. ప్రయాణికులకు ఇబ్బందిలేకుండా దశలవారీగా అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నాం. ఒకప్పుడు రైల్వేస్టేషన్‌కు వస్తే ముక్కు మూసుకొని రావాల్సిన పరిస్థితి ఉండేది. ప్రధాని మోడీ స్వచ్ఛభారత్ ద్వారా స్వచ్ఛ రైల్వేస్టేషన్ పేరుతో వినూత్న మార్పులను తీసుకొచ్చారు. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ని కూడా అధునాతనంగా నిర్మించుకొని ప్రారంభించుకున్నాం అన్నారు.

వాళ్లకా లాభాలు ఎలా వస్తున్నాయి?

త్రిభాషా విధానం దేశంలో కొత్తదేమీ కాదు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా తమపై హిందీ రుద్దుతోందని దుష్ప్రచారం చేస్తున్నారు. ఏ ఒక్కరిపై కూడా బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేయలేదు. ఏ భాష కావాలంటే అందులో చదువుకునే అవకాశం ఉంది. తమిళ భాషలో తీసిన సినిమాలు హిందీలో డబ్ చేసి రూ.కోట్లు లాభాలను నిర్మాతలు పొందుతున్నారు. వాళ్లకా లాభాలు ఎలా వస్తున్నాయి? భాష పేరుతో దేశాన్ని విభజించాలని చూడటం సరికాదు అన్నారు.

Related Posts
ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను రిలీవ్‌ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Telangana government relieved two IPS officers

డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్త్‎ను రిలీవ్ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌: సీనియర్ ఐపీఎస్ అధికారులు డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్త్‎ను తెలంగాణ సర్కార్ రిలీవ్ చేసింది. ఈ Read more

శివరాత్రికి ఉచితంగా అల్పాహారం :మంత్రి సురేఖ
భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సురేఖ !

శివరాత్రి రోజున ఉపవాసం ఉండే భక్తులకు మంత్రి కొండా సురేఖ మంచి శుభవార్త చెప్పారు. ప్రముఖ ఆలయాల్లో ఉపవాసం ఉండే భక్తులకు పండ్లు, అల్పాహారం ఉచితంగా అందించనున్నట్లు Read more

CISCO: తెలంగాణ ప్రభుత్వంతో సిస్కో కీలక ఒప్పందం..!
CISCO sign key agreement with Telangana government.

CISCO: తెలంగాణ ప్రభుత్వంతో సిస్కో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈరోజు అసెంబ్లీ కమిటీని హాల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిస్కో బృందం సమావేశం నిర్వహించింది. స్కిల్ యూనివర్సిటీలో Read more

కుంభమేళా తొక్కిసలాట ఘటనపై కేటీఆర్ స్పందన

ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట కారణంగా 30 మంది భక్తులు మృతి చెందడం అందరినీ విషాదంలో ముంచేసింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, Read more