జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ కలిసి జియోహాట్‌స్టార్ గా అవతరించింది. ఈ రెండు కలిసి సంయుక్త సేవలను ప్రారంభించాయి. అయితే దీనివల్ల ఐపీఎల్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్ లను చూసే అవకాశాన్ని ఈ జియోహాట్ స్టార్ కల్పించలేదు. ఇందుకోసం సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకోవాల్సిందేని తెలిపింది.
సబ్‌స్క్రిప్షన్ ఎంతంటే?
ఇప్పటివరకు ఐపీఎల్ మ్యాచ్ లను క్రికెట్ అభిమానులు ఎంచక్కా ఓటీటీలో ఫ్రీగా లైవ్ స్ట్రీమింగ్ చూస్తూ ఎంజాయ్ చేసేవారు. ఎక్కడ ఉన్న కూడా తమ స్మార్ట్ ఫోన్ లో యాప్ ఓపెని క్రికెట్ చూస్తూ ఆస్వాదించేవారు. కానీ ఇకపై ఆ సదుపాయాం ఉండదు. అందుకు కారణం ఇకపై జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ విలీనం అవ్వడమే. ఇలా విలీనం అవ్వడం వల్ల రెండింటిలోని కంటెంట్ ఒకే దాంట్లోనే వీక్షించొచ్చు. అంటే కంటెంట్ ను జియోహాట్‌స్టార్ లో వీక్షించొచ్చు అన్నమాట. అయితే ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ లోని కంటెంట్ ను చూడాలంటే కచ్చితంగా రూ.149 నుంచి ఉండే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ను రిచార్జ్ చేసుకోవాల్సిందే. కాబట్టి ఐపీఎల్ మ్యాచులు చూడాలంటే కనీస ప్లాన్ రూ. 149తో సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

ఐపీఎల్ చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి
జియో హాట్‌స్టార్ అందించిన తాజా సమాచారం ప్రకారం, ఇకపై ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే కచ్చితంగా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే.
హాట్‌స్టార్ పాత సబ్‌స్క్రిప్షన్ యూజర్లకు ప్రత్యేక అవకాశం
ఇప్పటికే డిస్నీ+ హాట్‌స్టార్ లేదా జియో సినిమా ప్రీమియం ప్యాకేజీ ఉన్నవారికి మూడు నెలల పాటు పాత రేట్లు అమలులో ఉంటాయి.
కొత్తగా సబ్‌స్క్రిప్షన్ తీసుకునే వారు మాత్రం తాజా ప్లాన్స్‌ను మాత్రమే తీసుకోవాలి.
విలీనంతో లభించే ప్రత్యేకతలు
ఐపీఎల్ మ్యాచ్‌లు, ఆసియా కప్, టి20 ప్రపంచకప్ వంటి క్రికెట్ టోర్నమెంట్లు హై-డెఫినిషన్ వీడియోలో వీక్షించే అవకాశం.
బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడ కంటెంట్ సమృద్ధిగా లభ్యం.
ఒకే ప్లాట్‌ఫామ్‌లో రెండు ప్రధాన కంపెనీల కంటెంట్ కలసి రావడం వినియోగదారులకు ప్రయోజనకరం.
యూజర్ల కోసం జాగ్రత్త సూచన
ఫ్రీ ఐపీఎల్ చూడాలని ఆశించి నకిలీ లింక్స్ క్లిక్ చేయకూడదు. సైబర్ నేరగాళ్లు వల వేసే అవకాశం ఉంది.
అధికారిక వెబ్‌సైట్ లేదా జియోహాట్‌స్టార్ యాప్ ద్వారా మాత్రమే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి.
ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా చూసే సదుపాయం ఇకపై లేకపోవడంతో కొంతమంది అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. అయితే, మరికొందరు మాత్రం మంచి క్వాలిటీ కంటెంట్ కోసం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం తప్పులేదని భావిస్తున్నారు.జియో సినిమా – హాట్‌స్టార్ విలీనంతో ఓటీటీ రంగంలో కొత్త పోటీ మొదలైంది. అయితే, ఉచిత సేవలు ఆశించే యూజర్లకు ఇది కొంత నిరాశ కలిగించే పరిణామమే. ఐపీఎల్ కోసం ప్రీమియం ప్లాన్ తీసుకోవడం తప్పనిసరి అవుతుండటంతో, క్రికెట్ ప్రియులు ముందుగా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఎంచుకుని రెడీగా ఉండటం మంచిది.