ఫ్రాన్స్ లో దారుణం- రోగులపై వైద్యుడు అత్యాచారం

ఫ్రాన్స్ లో దారుణం- 299 మంది రోగులపై వైద్యుడు అత్యాచారం

ఫ్రాన్స్ లో ఓ వైద్యుడు అత్యంత నీచమైన చర్యకు పాల్పడ్డాడు. అనారోగ్యంతో చికిత్స కోసం వచ్చిన రోగులపై అత్యాచారం చేశాడు. ఏళ్ల తరబడి సాగిన ఈ దారుణం ఇటీవల బయటపడింది. ఓ చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా, తాను చేసిన దారుణాలను ఆ వైద్యుడు వెల్లడించాడు. 1989 నుంచి 2004 వరకు 299 మందిపై అఘాయిత్యం చేసినట్లు అంగీకరించాడు. బాధితులలో ఎక్కువమంది చిన్నపిల్లలేనని, బాలికలతో పాటు బాలురపైనా దారుణాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడి బాధితులలో 158 మంది అబ్బాయిలు, 141 మంది అమ్మాయిలు ఉన్నారని చెప్పారు. అందులో కొంతమందికి తమపై అత్యాచారం జరిగిన విషయమే తెలియదని, పోలీసులు వెలుగులోకి తెచ్చిన నిందితుడి డైరీ ఆధారంగా వారు తెలుసుకున్నారని వివరించారు.

Advertisements
ఫ్రాన్స్ లో దారుణం- రోగులపై వైద్యుడు అత్యాచారం


30 ఏళ్లపాటు ఈ దారుణాలకు
బ్రిటానీ అనే ప్రాంతంలో 74 ఏళ్ల జోయెల్ లి స్కౌర్నెక్ ఓ ఆసుపత్రిలో సర్జన్ గా పనిచేసేవాడు. తన వద్దకు చికిత్స కోసం వచ్చే రోగులపై జోయెల్ అఘాయిత్యం చేసేవాడు. వారిని మత్తులోకి పంపాక అత్యాచారం చేసేవాడు. దాదాపు 30 ఏళ్లపాటు ఈ దారుణాలకు పాల్పడ్డాడు. అయితే, 2017లో పొరుగింట్లో ఉంటున్న ఓ ఆరేళ్ల చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించాడు. పాప తల్లిదండ్రులు కేసు పెట్టడంతో పోలీసులు జోయెల్ ను అరెస్టు చేశారు. విచారణలో నలుగురు చిన్నారులపై అత్యాచారం చేసినట్లు గుర్తించిన పోలీసులు సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో 2020లో కోర్టు జోయెల్ కు 15 ఏళ్ల శిక్ష విధించింది.
వెలుగులోకి సంచలన విషయాలు
ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. నిందితుడు జోయెల్ ఇంట్లో 3 లక్షలకు పైగా అసభ్య ఫొటోలు బయటపడ్డాయి. 650లకు పైగా అశ్లీల వీడియోలను గుర్తించినట్లు వివరించారు. లైంగిక దాడి జరిపిన బాధితుల వివరాలతో నిందితుడు ఓ డైరీని నిర్వహించినట్టు తెలిపారు. తాజాగా లభించిన సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టామని తెలిపారు. చికిత్స కోసం తన దగ్గరికి వచ్చిన చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడినట్లు కోర్టులో జోయెల్ అంగీకరించాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోందని, దోషిగా నిర్ధారణ అయితే జోయెల్ కు మరో 20 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు వివరించారు.

Related Posts
Rahul gandhi: రాహుల్‌ గాంధీ పౌరసత్వంపై కేంద్రానికి గడువు ఇచ్చిన అలహాబాద్‌ హైకోర్టు
రాహుల్‌ గాంధీ పౌరసత్వంపై కేంద్రానికి గడువు ఇచ్చిన అలహాబాద్‌ హైకోర్టు

కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పౌరసత్వం అంశంలో కేంద్ర ప్రభుత్వానికి అలహాబాద్‌ హైకోర్టు గడువు నిర్దేశించింది. నాలుగు వారాల్లో పౌరసత్వం అంశం తేల్చాలని Read more

జెప్టో $300 మిలియన్ నిధులను సేకరించేందుకు ప్రణాళిక
zepto

ఇండియాలో ప్రముఖ క్విక్ కామర్స్ స్టార్టప్ అయిన జెప్టో(Zepto) తన వ్యాపారాన్ని పెంచేందుకు $300 మిలియన్ నిధులను సేకరించాలనుకుంటోంది. ఈ నిధులు సేకరణ ద్వారా, జెప్టో భారతీయ Read more

Ausralia:గబ్బా స్థానంలో కొత్త స్టేడియం కు శ్రీకారం
Ausralia:గబ్బా స్థానంలో కొత్త స్టేడియం కు శ్రీకారం

బ్రిస్బేన్ క్రికెట్ గ్రౌండ్, సాధారణంగా గబ్బా అని పిలుస్తారు, ఇది ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ రాజధాని బ్రిస్బేన్‌లోని ఒక ప్రధాన క్రీడా స్టేడియం.శతాబ్ద కాలంగా చరిత్ర కలిగిన గబ్బా Read more

US Elections 2024 : దూసుకెళ్తున్న ట్రంప్
US Elections 2024 Rushing

రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ యూఎస్ ఎన్నికల కౌంటింగ్లో దూసుకెళ్తున్నారు. 20 రాష్ట్రాల్లో ఆయన గెలుపొందారు. మిసిసిపీ, నార్త్ డకోటా, నెబ్రాస్కా, ఒహాయో, ఓక్లహామో, Read more

×