అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఓటీటీలోకి వచ్చేసింది – ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సడెన్ రిలీజ్!
ఇటీవలి రోజుల్లో ఓటీటీ ప్రపంచం చిత్రాలతో కిటకిటలాడుతోంది. గత వారం మాత్రమే 30కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ వేదికలపైకి వచ్చాయి. అయితే వీటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగాయి. తాజాగా మరో తెలుగు చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ఎలాంటి హైప్ లేకుండానే సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. నందమూరి కల్యాణ్ రామ్, లెజెండరీ నటీమణి విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఎమోషనల్ సెంటిమెంట్‌తో కూడిన ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, తల్లీ కొడుకుల (mother and son) అనుబంధం ప్రధానాంశంగా ఉండగా, క్లైమాక్స్‌లో వచ్చిన ట్విస్ట్ ప్రేక్షకుల మనసులను కదిలించగలిగింది.

థియేటర్లలో యావరేజ్.. కానీ ఓటీటీలో హోరెత్తిస్తుందా?
ఈ ఏడాది ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. కల్యాణ్ రామ్ మరియు విజయశాంతిల నటనకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందినప్పటికీ, కథలో లోపాలు, పునరావృత కథన శైలి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే చివర్లో ఉన్న ఎమోషనల్ హైపాయింట్, కల్యాణ్ రామ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ మాత్రం హైలైట్‌గా నిలిచాయి. డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, థియేటర్ రన్‌ను సాధారణ స్థాయిలో ముగించుకుంది. కానీ ఓటీటీ వేదికపై అయితే ఈ మూవీకి సెకండ్ ఛాన్స్ దక్కినట్లే.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్.. కానీ ఒక ట్విస్ట్ ఉంది!
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం (మే12) అర్ధరాత్రి నుంచే ఈ మూవీ ఓటీట స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ప్రస్తుతం తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ, యూకేలో ఉన్నవాళ్లు అది కూడా అద్దె విధానంలో మాత్రమే ఈ మూవీని చూడొచ్చు. అయితే ఈ గురువారం లేదా శుక్రవారం ఇండియాలో కూడా ఈ మూవీ అందుబాటులోకి రావొచ్చునని తెలుస్తోంది.
భారీ తారాగణంతో వచ్చిన ఫ్యామిలీ యాక్షన్ డ్రామా
ఈ సినిమాలో నందమూరి కల్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మంజ్రేకర్‌తో పాటు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, సోహైల్ ఖాన్, పృథ్వీరాజ్, చరణ్ రాజ్, భరత్ రెడ్డి వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించగా, కథానాయిక సాయి మంజ్రేకర్ పాత్ర కథనానికి బలాన్ని చేకూర్చింది. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు. అత్యున్నతమైన నిర్మాణ విలువలతో రూపొందిన ఈ చిత్రం ఓటీటీలో మంచి స్పందన పొందాలన్నది మేకర్స్ ఆశ.
Read also: Chandrababu: తారక రామరావుకు వెల్ విషెస్ చెప్పిన చంద్రబాబు