हिन्दी | Epaper
పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు

Health: చిన్నచిన్న విషయాలకే భయపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు మీకోసమే

Anusha
Health: చిన్నచిన్న విషయాలకే భయపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు మీకోసమే

ఆందోళన అనేది మనిషి జీవనంలో సాధారణంగా కలిగే భావన. ఇంట్లో ఎవరైనా జబ్బు పడ్డప్పుడో, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడో ఆందోళన మామూలే. కానీ అదేపనిగా, ఏ కారణమేదీ లేకుండా ఆందోళన చెందుతుంటే మీరు ఆంగ్జయిటీ డిజార్డర్​తో (ఆందోళన సమస్య) బాధపడుతున్నారేమో చెక్ చేసుకోమంటున్నారు నిపుణులు. తరచూ కనిపించే మానసిక సమస్యల్లో ఆందోళన ఒకటి. ఇది మితిమిరితే ఎలాంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందో, దీన్ని ఎలా నివారించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!: చాలా మందికి నలుగురిలో మాట్లాడేటప్పుడు మనసులో ఆందోళన ఉంటుంది. కానీ, ఈ సమస్య మాట్లాడేలా ప్రోత్సహించటానికి, సన్నద్ధం కావటానికీ తోడ్పడుతుందని నిపుణులు అంటున్నారు. బాగా ట్రాఫిక్ ఉన్నప్పుడు బైక్ లేదా కారు నడపటం ఆందోళనకు దారితీయొచ్చు. కానీ, ఇది అప్రమత్తంగా ఉండటానికి, ప్రమాదాలు జరగకుండా చూసుకోవడానికి దోహదపడుతుంది. అయితే, మరీ తీవ్ర ఆందోళన, భయంతో ఆయా పనులు చేయటమే మానేయడం వల్ల రోజువారీ పనులకూ విఘాతం కలిగిస్తుంటే? ఇది సమస్యగా మారినట్టేనని నిపుణులు అంటున్నారు.అంతర్గత ఒత్తిడిని తట్టుకోలేకపోవటం వల్ల ఆందోళన సమస్యకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య నెమ్మదిగానే మొదలవుతుందని తెలిపారు. చాలా మందిలో ఇది బాల్యంలో లేదా యుక్త వయసులో తలెత్తుందని వివరించారు. కొంతమందిలో ఈ సమస్య పెద్దయ్యాకా ఆరంభం కావొచ్చనని చెబుతున్నారు. దీని బారినపడ్డ వారిలో కుంగుబాటు వంటి ఇతరత్రా సమస్యలూ కనిపిస్తుంటాయని పేర్కొన్నారు. కానీ ఆందోళన సమస్య ఎవరికి వస్తుంది? ఎందుకొస్తుంది? అనేది కచ్చితంగా తెలియదంటున్నారు. జన్యు, శారీరక అంశాలు పరిసర ప్రభావాలు, కొందరిలో వంశపారంపర్యంగానూ వస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఆత్మీయుల మరణం, వేధింపులకు గురికావటం, దీర్ఘకాలం జబ్బులతో బాధపడుతూ రావటం వంటివీ కారణం కావొచ్చనని నిపుణులు చెబుతున్నారు.

లక్షణాలు

బాధను నియంత్రించుకోలేకపోవడం,ఏకాగ్రత కుదరకపోవటం,చిరాకుగా అనిపించటం,నిద్రలేచినప్పుడు ఉత్సహంగా అనిపించకపోవటం,కండరాలు బిగుసుకోవటం,విపరీతంగా చెమటలు పట్టడం,శ్వాస సరిగా తీసుకోలేకపోవటం,చిన్నవిషయానికి భయపడటం,నీరసం, నిస్సత్తువ,తల, కండరాల నొప్పి,శరీర భాగాలు మొద్దుబారడం, సూదులు పొడుస్తున్నట్టు అనిపించడం.ఆందోళన సమస్య లక్షణాలు థైరాయిడ్, గుండె జబ్బుల మాదిరిగానూ కనిపిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్లు శారీరక, మానసిక లక్షణాలు ప్రవర్తన, ఆలోచన తీరు, ఆందోళన కలిగే పరిస్థితుల వంటి అన్నింటినీ నిశితంగా పరిశీలించి నిర్థారిస్తారు. అవసరాన్ని బట్టి కౌన్సెలింగ్ ఇస్తారని నిపుణులు పేర్కొన్నారు.

 Health: చిన్నచిన్న విషయాలకే భయపడుతున్నారా? అయితే  ఈ చిట్కాలు మీకోసమే

చిట్కా

ఆందోళన సమస్యలు జీవితంలో ప్రతి విషయంలో ప్రభావం చూపుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి క్లిష్ట సమయాల్లో ధైర్యంగా ఉండటం, భయాలను నియంత్రణలో ఉంచకోవటం చాలా ముఖ్యమని తెలిపారు. ఈ ఆందోళన సమస్యలు పురుషులతో పోలిస్తే మహిళలోనే అధికంగా ఉంటుందని  వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ అధ్యయనంలో పేర్కొంది. ఒత్తిడికి, భయాలకు కారణమవుతున్న విషయాలను మొదట తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీరు మీటింగులో మాట్లాడటానికి భయపడుతుంటే కాసేపు అలా పార్కులోకి వెళ్లి కూర్చోమని సలహా ఇస్తున్నారు. ఆరుబయట, పచ్చని చెట్ల మధ్య సేద తీరితే ఆందోళన తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు.

Read Also: Bathing Tips: స్నానం ఎప్పుడు చేస్తే మంచిదో తెలుసా..?

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

    📢 For Advertisement Booking: 98481 12870