हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ సమావేశం .. పలు కీలక అంశాలపై చర్చ

Anusha
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ సమావేశం .. పలు కీలక అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులకు కాబినెట్ (AP Cabinet) ఆమోదం తెలిపే అవకాశం ఉంది.7వ ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదం పొందిన 19 ప్రాజెక్టులకు సంబంధించిన రూ.28,546 కోట్ల పెట్టుబడులకు కాబినెట్ ఆమోదం తెలుపనుంది. అంతేకాకుండా, రాజధాని ప్రాంతంలో 1450 ఎకరాలలో మౌలిక వసతుల కల్పనకు రూ.1052 కోట్లతో టెండర్లు పిలవడానికి కూడా కాబినెట్ ఆమోదం తెలుపనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డును జాతీయ రహదారి (National Highway) 16కి అనుసంధానం చేయడానికి రూ.682 కోట్లతో టెండర్లు ఆహ్వానించే అంశంపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు.

AP Cabinet:  నేడు ఏపీ కేబినెట్ సమావేశం .. పలు కీలక అంశాలపై చర్చ
AP Cabinet:

చర్చించే అవకాశం

అమరావతి ప్రాంతంలో రెండవ దశలో 44 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించే అంశం, కొన్ని సంస్థలకు భూ కేటాయింపులు వంటి అంశాలపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. త్వరలో అమలు చేయనున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన విధి విధానాలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. మొత్తంగా, ఈ రోజు జరిగే కేబినెట్ (Cabinet Meeting) సమావేశం ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థికంగా, పారిశ్రామికంగా కొత్త దిశను అందించనున్నదిగా భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మళ్లీ అభివృద్ధి శకం ప్రారంభమవుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కీలక నిర్ణయాల తర్వాత అధికారిక ప్రకటనలపై రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read Also: AP High Court: ANU డిగ్రీ ఫలితాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870