ఏపీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన స్వర్ణాంధ్ర లక్ష్యంతో ముందుకు అడుగులు వేస్తున్నామని, ప్రకృతి వ్యవసాయంపై ప్రధాన దృష్టి సారించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుగారు వరి పంటను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నాయని వెల్లడించారు.
11 పంటలను గ్రోత్ ఇంజిన్లుగా పరిగణిస్తున్నామని, ఆ పంటలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయంలో వృద్ధిరేటు 22.86 శాతంగా నమోదయిందని తెలిపారు. రాయితీపై విత్తన పంపిణీ పథకానికి ప్రత్యేక కేటాయింపులు చేస్తున్నామని చెప్పారు. రూ. 48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ. 120 కోట్ల విత్తన రాయితీలను తమ ప్రభుత్వంలో చెల్లించామని చెప్పారు. 35.8 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు సరఫరా చేశామని తెలిపారు.

స్వర్ణాంధ్ర లక్ష్యం
అచ్చెన్నాయుడు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచడం, వ్యవసాయ యాంత్రీకరణతో పాటు రాష్ట్రంలో వ్యవసాయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో, పంటల అభివృద్ధికి ప్రత్యేక కేటాయింపులు, పంటల నాణ్యత పెంచడం, ఆర్థిక సమర్థత దృష్ట్యా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.
11 పంటల గ్రోత్ ఇంజిన్లుగా అభివృద్ధి
అచ్చెన్నాయుడు 11 పంటలను “గ్రోత్ ఇంజిన్లుగా” పరిగణిస్తున్నామని, వాటిని అభివృద్ధి చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తేవాలని అన్నారు. ఈ 11 పంటలలో ముఖ్యంగా వరి, పచ్చిమిర్చి, పత్తి వంటి పంటలు ఉన్నాయి. ఇవి రైతులకు అధిక ఆదాయం, ఆదర్శ వ్యవసాయ నాణ్యతను కలిగి ఉంటాయి
వ్యవసాయ రంగంలో వృద్ధి
అచ్చెన్నాయుడు, వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు 22.86 శాతంగా నమోదయిందని తెలిపారు. ఈ వృద్ధిని సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, పంటల అభివృద్ధి మరియు వ్యవసాయ యాంత్రీకరణ ముఖ్యపాత్ర పోషించాయని పేర్కొన్నారు.
వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు
ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ బడ్జెట్‌లో ప్రత్యేకంగా రాయితీపై విత్తన పంపిణీ, ఎరువుల సరఫరా, మరియు ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహానికి అనేక పథకాలు పథకాలు ఉన్నాయి.
రైతులకు సాయం
రైతు సంక్షేమం, అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ అమలు కోసం రూ. 9,400 కోట్లు కేటాయించడం, రైతులకు ఆర్థిక పునరుద్ధరణ మేలు చేసే చర్యలు తీసుకోవడమే కాకుండా, ఉచిత పంటల బీమా కోసం కూడా రూ. 1,023 కోట్లు కేటాయించినట్లు ఆయన చెప్పారు.
పంటల రక్షణ
ఇది కాకుండా, అచ్చెన్నాయుడు పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం రూ. 92 కోట్లు, ధరల స్థిరీకరణ నిధి కోసం రూ. 300 కోట్లు, ఎరువుల బఫర్ స్టాక్ నిర్వహణ కోసం రూ. 40 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
ప్రకృతి వ్యవసాయ పట్ల అవగాహన పెంచడం, డ్రోన్ల సహాయంతో వ్యవసాయ పనులను తక్కువ సమయంలో పూర్తి చేయడం, పంటలకు ప్రోత్సాహం ఇవ్వడం, వీటి ద్వారా రైతుల ఆదాయం పెరిగే దిశగా చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు తెలిపారు.