📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

YV Subbareddy: రక్షణ కల్పించాలంటూ టీజీ హైకోర్టును ఆశ్రయించిన వైవి సుబ్బారెెడ్డి భార్య

Author Icon By Anusha
Updated: May 23, 2025 • 2:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి భార్య వైవీ స్వరణలతారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తమ భూమిలోకి ప్రైవేటు వ్యక్తులు ప్రవేశించకుండా రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఆ వివరాలు రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌ గ్రామ పరిధిలోని 87/2 సర్వే నంబర్‌లో వైవీ సర్ణలతారెడ్డికి 2.08ఎకరాల భూమి ఉందని తెలిపారు.అయితే కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆ భూమిని ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నట్లు స్వర్ణలతారెడ్డి ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జి.నర్సింహారెడ్డి, షేక్‌ ఇస్లాముద్దీన్‌, కొప్పుల మల్లారెడ్డి తమ భూమిని ఆక్రమించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై గతంలో గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశామని అయినా వారు పట్టించుకోవడం లేదని ఆమె పిటిషన్‌లో వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులు తమ భూమిలోకి ప్రవేశించకుండా రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని ఆమె కోర్టును అభ్యర్థించారు.

రిజిస్టర్

బుధవారం ఈ పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్‌ జె.శ్రీనివాసరావు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంలో పిటిషనర్‌తోపాటు ప్రైవేటు ప్రతివాదుల వాదన విని రెండువారాల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించింది. అలానే దీని గురించి స్వర్ణలతా రెడ్డికి సమాచారం ఇవ్వాలని తెలిపింది. తదుపరి విచారణ జూన్‌ 23‌కు వాయిదా వేశారు.ఈ వివాదంలో సీనియర్ కౌన్సిల్ వినోద్ కుమార్ దేశ్‌పాండే స్వరణలతా రెడ్డి(Swaranalatha Reddy)తరఫున వాదనలు వినిపించారు. సర్వే నంబర్ 87లో మొత్తం 8 ఎకరాల స్థలం ఉందని తెలిపారు. తన క్లైంట్ అక్కడ 2.08 ఎకరాల భూమిని అసలు యజమాని నుంచే కొనుగోలు చేసిందన్నారు. అంతేకాక ఆ భూమి తన క్లైంట్ పేరు మీద రిజిస్టర్ అయినట్లు రెవెన్యూ రికార్డ్‌లో ఎంట్రీలు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ భూమి అక్రమ ఆక్రమణకు సంబంధించి పోలీసులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికి వారు సరైన చర్యలు తీసుకోలేదని ఆయన కోర్టుకు తెలిపారు.

YV Subbareddy: రక్షణ కల్పించాలంటూ టీజీ హైకోర్టును ఆశ్రయించిన వైవి సుబ్బారెెడ్డి భార్య

తరఫున

ఈ భూమి విలువ రూ.200 కోట్లు అని తెలుస్తోంది. తమ పేరిటి ఉన్న ఈ భూమిని రాజకీయ పలుకుబడి ఉన్న ఎ.అనిల్‌రెడ్డి (A.Anil Reddy) కబ్జా చేశారని గతంలోనే వైవీ స్వరణలతారెడ్డి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, భూమి తమదేనంటూ నర్సింహారెడ్డి అనే వ్యక్తి తరఫున ఆయన వాచ్‌మన్‌ ఫిర్యాదు చేయగా ఇరువర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక తాజాగా ఇదే వివాదంపై స్వర్ణలతా రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

Read Also: Covid: ఆంధ్రలో మరో కరోనా కేసు నమోదుతో అప్రమత్తం అయిన ప్రభుత్వం

#KondapurLandIssue #LandDispute #TelanganaHighCourt #YVSwarnalathaReddy Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.