చేయబోయేపనిని గూర్చి తెలుసుకోవడం వివే కం. ఎలా చేయాలో తెలుసుకోవడం నైపుణ్యం. పూర్తి చేయడం సామర్థ్యం. ఈ మూడింటిలో నూ సాఫల్యం చెందితేనే పరిపూర్ణత లభిస్తుంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాం. ఇది వ్యక్తులకైనా, సంస్థలకైనా, ప్రభుత్వాలకైనా వర్తిస్తుంది. దేశంలో కోట్లాది మంది యువతీ యువకులు నిరాశానిస్పృహ ల్లో మునిగితేలుతున్నారనే విషయం పెద్దలకు తెలియంది కాదు. వారిలో నూతనోత్సాహం నింపి జీవితం పట్ల ఆశలు రేకెత్తించి కార్యోన్ముఖులను చేసేందుకు తీసుకోవా ల్సిన చర్యల గూర్చి కూడా పెద్దలకు క్షుణ్ణంగా తెలుసు. కానీ ఆవైపు అడుగులు పడడం లేదు. రాజకీయ నాయకులు ఎప్పుడూ రాబోయే ఎన్నికల గూర్చి ఆలోచిస్తే రాజనీతిజ్ఞులు భావితరాల భవిష్యత్ గురించి మదనపడు తుంటారు. ఆధునాతన ప్రపంచంలో కాలాన్ని మించిన వేగంతో శస్త్రసాంకేతిక రంగాలు పూరోగమిస్తున్నాయి. ఆధునిక మానవుడు అపూర్వమైన మేధసంపత్తిని సంత రించుకుని శ్రద్ధాయుక్తులు, ప్రతిభాసామర్థ్యాలతో విశ్వంత రాలపై సాధిస్తున్న విజయాల వెనుక యువశక్తి పాత్ర అత్యంత కీలకమైందనే విషయం కూడా అందరికి తెలిసిందే. నవభారత నిర్మాణానికి ఉద్యమించి దేశ కీర్తిప్రతిష్ట లను ఇనుమడింప చేయాల్సిన పవిత్ర బాధ్యత యువత (youth)భుజస్కంధాలపై ఉందనే విషయం పాలక పెద్దలు పదేపదే సెలవిస్తుంటారు. కాగితాలపై కళావిన్యాసంతో ఈలక్ష్యాన్ని సాధించడం సాధ్యం కాదని దేశంలోని పల్లెపల్లెల్లో, బస్తీ ల్లోనూ స్థితిగతులను చక్కదిద్ది ఆర్థికంగా, సామాజికంగా, సంస్కృతికంగా యువజనులందరిని కలిపి ఐక్యతతో కృషి చేస్తే దేశానికి ఉజ్వల భవిష్యత్ సుసాధ్యమవుతుందనే విషయం కూడా తెలియందేమీ కాదు. ఇందుకోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. మారిన కాలానుగుణ పరిస్థితుల దృష్ట్యా ముఖ్యంగా విద్యావిధానంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టంగా తెలిసినా ఆ కోణంలో నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేకపోతున్నారు. కొన్ని సంద ర్భాల్లో తీసుకున్నా అమలుకు నోచుకోవడం లేదు. చాలా మంది విషయంలో చదివే చదువుకు, జీవనోపాధికి సం బంధం లేకుండాపోతు న్నది. ఇంజినీరింగ్ విద్యను అభ్య సించిన విద్యార్థులు ఎందరో వారి చదువుతో సంబంధం లేని హోంగార్డులు, చివరకు నాలుగో తరగతి ఉద్యోగానికి కూడా క్యూలు కడుతున్నారు. ఒకరిద్దరు కాదు. వేలసంఖ్య లో నియామకాలకు
హాజరవుతున్నారు. అంతేకాదు ఈ ఉద్యోగాలకోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకుంటు న్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక బంగారు కొలువుగా మారిపోయింది. ఆ ఉద్యోగంలో చేరితే ఆ కుటుంబానికి ఆరోగ్య, ఆర్థిక, భద్రత లభిస్తా యనే ఆశలు పెరిగిపోయాయి. అటు కేంద్రప్రభుత్వం, ఇటు రాష్ట్రప్రభుత్వాలు ఉద్యోగ నియామకాలకు సంబం ధించి ప్రకటనలు ఇస్తున్నారు. కొంతమేరకు నియామకా లు కూడా జరుగుతున్నాయి. ఆ ఉద్యోగాల కోసంగ్రామాల్లో ఉన్న యువత పట్టణాలకు చేరుకొని కోచింగ్ సెంటర్లబాట పడుతున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసుకుంటు న్నారు. దీనిని సొమ్ము చేసుకునేందుకు కొన్ని కోచింగ్ సెంటర్లు తమ శక్తి కొలదీ ప్రయత్నాలు చేస్తున్నాయి. పరీ క్షలు ఆలస్యమయ్యే కొద్దీ ఈ కోచింగ్ సెంటర్లకు అంతగా లక్ష్మిప్రసన్నం ఉంటుంది. మరొకపక్క ఎలాంటి అవకతవ కలు లేకుండా, దళారుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసేందుకు ఆయా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నా శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలున్నట్లు ఈ దళారులు ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక చోట చొచ్చుకుపోయేందుకు ప్రయ త్నం చేస్తున్నారు. ఇక దేశంలో ప్రభుత్వ కొలువుల కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది యువతీయువకులకు
ప్రభుత్వపరంగా ఉద్యోగాలు కల్పించడం అనేది సాధ్యమ య్యే పనికాదు. అలా కోరుకోవడం కూడా ఏమాత్రం సమంజసం కాదు. పోని స్వయం ఉపాధి పథకాలైనా అవకతవకలకు, అవినీతికి దూరంగా నడుస్తున్నాయంటే అదీ లేదు. ఉత్తరమో, దక్షిణమో లేకుండా ఫైళ్లు కదలని పరిస్థితి. యువజన శక్తులే దేశాభివృద్ధికి బాటలంటూ ఉప న్యాసాలు ఇస్తూ దేశవ్యాప్తంగా స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు లక్షలాది కోట్లరూపాయలు యువజన సంక్షేమానికి వెచ్చించినా ఆశించిన ఫలితాలు కన్పించడం లేదు. యువజనుల్లో రోజురోజుకు నిరుత్సాహం పెరిగి పోతున్నది. అన్నిటికంటే ముఖ్యంగా దేశప్రగతికి పట్టుగొమ్మలైన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత పరిస్థితి మరింత దారుణంగా తయారవుతున్నది. చదివిన చదువుకు తగిన ఉపాధి దొరక్కపోయినా జీవించేందుకు అవసరమై న కనీస సంపాదనకు సైతం నోచుకోని దుర్భర పరిస్థితు ల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఉన్నత చదువులు చదివిన యువకులు గ్రామాల్లో రోజువారీవ్యవసాయ పనులకు వెళ్లలేక ఒకవేళ పరిస్థితుల ప్రభావంతో విధిలేక వెళ్లినా అలవాటు లేని కష్టం చేయలేక దేశవ్యాప్తంగా కోట్లాది మంది యువతీయువకులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మరొకపక్క ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యో గులను మోసం చేసే కార్యక్రమాలు దేశంలో నిరాటంకంగా జరుగుతున్నాయి. ఇదంతా లేతమనసులపై చెరగని ముద్ర వేస్తున్నది. సమాజంపై ప్రేమ, అభిమానం ఉన్న యువతీయువకులే పగద్వేషంతో రగలిపోతున్నారు. మరి కొందరు నిస్సహాయకస్థితిలో జీవితంపై విరక్తి చెంది బల వన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరవాలి. యువతీయువకుల్లో ఆత్మవిశ్వాసం పెంచాలి. అందుకు ముఖ్యంగా ప్రభుత్వవైఖరిలో మార్పురావాలి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also :