📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Andhra Pradesh: కలెక్టరేట్​లో న్యాయం కోసం యువతి ఆవేదన

Author Icon By Anusha
Updated: May 20, 2025 • 1:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా స్థానిక సంస్థల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంపై ప్రజల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్‌ ప్రాంగణంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో ఒక యువతి ఆవేదనతో చేసిన చర్య అధికారుల హృదయాలను కదిలించింది.గూడూరు మండలం తరకటూరుకు చెందిన భువనేశ్వరి అనే యువతి తన సమస్యను పరిష్కరించమని అధికారులను వేడుకుంటూ,’నా దగ్గర డబ్బుల్లేవు ఇవి నా చెవి బంగారు కమ్మలు అందుకే ఈ బంగారం తీసుకొని నాకు న్యాయం చేయండి’ అంటూ ఓ యువతి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయానని తన సమస్యను అర్థం చేసుకుని పరిష్కరించమని వేడుకున్నారు. ఇలా తన బంగారు చెవి కమ్మలను కలెక్టరేట్లోని అధికారుల టేబుల్ మీద పెట్టారు. మచిలీపట్నం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో ఈ సంఘటన జరిగింది.తన తాత యల్లంశెట్టి గాంధీ దగ్గర తాను పెరిగానన్నారు భువనేశ్వరి(Bhuvaneshwari). తన తాత తండ్రి పేరు మీద గ్రామంలో కొంత స్థలం ఉండేదని దానిని ఆయన సోదరులు బలవంతంగా తీసుకుని వేరే వాళ్లకు అమ్మేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కోర్టుకు వెళ్లగా తీర్పు తనకు అనుకూలంగా వచ్చిందని కానీ కోర్టులో కేసు జరుగుతుండగానే కొందరు రాజకీయ నాయకుల అండతో తన స్థలంలో ఇల్లు కట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పన్ను లేకపోయినా వారికి నీటి కనెక్షన్లు ఇచ్చారని తన ఆస్తిలో అక్రమంగా ఉంటున్న వారికి ఎలా ఇంటి పన్ను(House tax) ఇచ్చారని, వాటి వివరాలు ఇవ్వాలని తాను అధికారులకు అర్జీ పెట్టుకున్నట్లు వివరించారు. ఆర్డీవోను రెండుసార్లు కలిశానని ఆర్డీవో సమస్యను పరిష్కరిస్తామని చెప్పినా, పంచాయతీ అధికారులు స్పందించకపోవడంతో మరోసారి అర్జీ పెట్టుకున్నట్లు వివరించారు.

Andhra Pradesh: కలెక్టరేట్​లో న్యాయం కోసం యువతి ఆవేదన

ఆగ్రహం

తన ఊరిలోని కొందరు నేతలు, అధికారులు డబ్బులు ఇస్తేనే తన పని జరుగుతుందని డిమాండ్ చేస్తున్నారని, తనకు ఎవరూ లేరని తెలిసి బెదిరిస్తున్నారని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి తనను తిప్పుకుంటున్నారని వాపోయింది. అందుకే విసిగిపోయి తన చెవి కమ్మలను అధికారుల ముందు పెట్టానని తెలిపింది. ఆర్డీవో స్వాతి వెంటనే స్పందించి ఆమె సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చెవి కమ్మలను తిరిగి తీసుకోవాలని యువతికి నచ్చజెప్పారు. మహిళ అర్జీని పరిశీలించిన ఆర్డీవో స్వాతి పంచాయతీ అధికారులను పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ యువతి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.

Read Also : AP Cm: ప్రజలకు అందించే సేవల్లో రాజీపడనన్న సీఎం చంద్రబాబు

#APNews #HeartbreakingStory #KrishnaDistrict #PGRS #PublicGrievance Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.