📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

YOGA: 2 వేల మందితో ‘కృష్ణా యోగా’

Author Icon By Anusha
Updated: June 12, 2025 • 11:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ రికార్డు సృష్టించిన విజయవాడ వివిధ రకాల పడవలపై రెండువేలమంది యోగాసనాలు

విజయవాడ: విజయవాడలోని బెరం పార్క్ వద్ద కృష్ణా నదిలో నిర్వహించిన యోగా కార్యక్రమం వరల్డ్ రికార్డ్ సృష్టించింది. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా కృష్ణా నదిలో 2000 మంది వివిధ రకాల పడవలపై యోగాసనాలు వేసి వరల్డ్ రికార్డు నెలకొల్పారు. యోగాను ప్రతి ఇంటికి పరిచయం చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే అన్నీ ప్రముఖమైన ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరినీ ఇందులో భాగస్వామ్యంచేయాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని తూచాతప్పకుండా అధికార యంత్రాంగం పాటిస్తోంది. యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్స్(Yoga on Watercraft) పేరిట కార్యక్రమం జరిగింది. బుధవారం తొలి జాము నుంచి చిరు జల్లుల సవ్వడి చేస్తూ కృష్ణా తీరం ఆహ్లాదకర వాతావరణం సంతరించుకుంది.

రెండువేలమందికి పైగా యోగాసనాలు

నగరంలోని బెరం పార్కు వద్ద కృష్ణమ్మ తీరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ నేతృత్వంలో నిర్వహించిన వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా మెగా ఈవెంట్లో పాల్గొనేందుకు యోగా ప్రియులు విశేషంగా తరలిరావడంతో పులకించింది. ఉదయాన్నే బెరం పార్కుకు చేరుకున్న పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, జిఎడి పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా(Mukesh Kumar Meena), జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్రలకు యోగా,ప్రియులు హర్షధ్వానాలతో స్వాగతంపలికారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన యోగా ఔత్సాహికులు పంట్లు, బోట్లు, స్పీడ్ బోట్లు, కయాక్స్ బోట్లు, శాండ్ బోట్లు, జెట్ స్కీ, లైఫ్ బోట్లు వంటి 201 వాటర్ క్రాప్టులతో పాటు నదీ తీర ప్రాంతంలో ఏర్పాటుచేసిన పచ్చని తివాచీలపై 2000 మంది యోగాసనాలు ఆచరించడంతో కృష్ణమ్మ ఒడి పులకించింది.

బోట్లపై యోగాసనాలు

ప్రపంచ రికార్డు సాధిం చాలన్న జిల్లా యంత్రాంగం ఆశయం నెరవేరింది. యోగాసనాలను ఆద్యంతం నిశితంగా పరిశీలించిన వరల్డ్ రికార్డ్స్ యూనియన్ (డబ్ల్యూఆర్ యూ) న్యాయనిర్ణేత షరీఫ్ హానిఫ్(Sharif Hanif)యోగా కార్యక్రమాన్ని నిర్వహించిన తీరు, యోగాసనాలను ఆచరించిన విధానం, తరలివచ్చిన ఔత్సాహికులను క్షుణ్నంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రపంచ రికార్డు సాధించినట్లు వేలాది మంది హర్షధ్వానాల మధ్య రికార్డు సాధించినట్లు ప్రకటించారు. ఓ నదిలో అత్యధిక మందితో,అత్యధిక బోట్లపై యోగాసనాలు చేసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నట్లు ధ్రువీకరిస్తూ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, జిఎడి పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా, ఎన్టిఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రలు సర్టిఫికెట్ లు అందించారు.

కలెక్టర్ నేతృత్వంలో

కలెక్టర్ లక్ష్మీశ నేతృత్వంలో ఆయన బృందం ఆపూర్వ కృషికి ఫలితంగా ప్రపంచ రికార్డు అని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ (డబ్ల్యూఆర్ యూ) న్యాయనిర్ణేత షరీఫ్ హానిఫ్ పేర్కొన్నారు. క్రమశిక్షణ, సమష్టి కృషి, నిబద్ధత ఫలితంగా పవిత్ర కృష్ణా నదీ తీరం సరికొత్త ప్రపంచ రికార్డుకు వేదికయిందన్నారు. ఇన్నొవేషన్, హెల్త్, ఫిట్నెస్తో పాటు పర్యావరణ పరిరక్షణపట్ల జిల్లా అధికార యంత్రాంగం, ప్రజల చిత్తశుద్ధికి ఇది గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు. ఐక్యత, శ్రేయస్సు, సంస్కృతీ సంప్రదాయాల పట్ల నిబద్ధతను చాటిచెప్పేలా ఈ రికార్డుతో విజయవాడ ప్రజలు గొప్ప సందేశాన్ని ఇచ్చారని, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికీ వరల్డ్ రికార్డ్స్ యూనియన్(World Records Union) తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు షరీఫ్ హానిఫ్ తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నగర ప్రజలు ఎంతో చైతన్యవంతులన్నారు.

ఆశయానికి అనుగుణంగా

అందరికీ ఆదర్శంగా నిలవాలనే తపన వారిలో కనిపిస్తుందని ఆ నిబద్ధత ఫలితమే నేటి ప్రపంచ రికార్డు అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(Keshineni Shivanath) అన్నారు. జిల్లా అధికార యంత్రాంగం, విఎంసి, ప్రజల సమష్టి కృషితో రికార్డు సొంతమైందని, బెరం పార్కు, పున్నమి ఘాట్ వద్ద నదీతీరం గతంలోనూ వివిధ ప్రపంచ రికార్డులకు వేదికగా నిలిచిందని, ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా 5000 డ్రోన్లతో మెగా డ్రోన్ షోతో ప్రపంచ రికార్డులు సాధించినట్లు తెలిపారు. ప్రధాని సమక్షంలో ఈ నెల 21న విశాఖలోనూ అయిదు లక్షల మందితో యోగాసనాలు ఆచరించి ప్రపంచ రికార్డు సాధించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

యోగాంధ్ర 2025

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఆహ్లాదకర వాతావరణంలో ఎన్టీఆర్ జిల్లా(NTR District) యంత్రాంగం ఏర్పాటు చేసిన మెగా యోగా ఈవెంట్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, యోగాంధ్ర 2025లో ప్రపంచ రికార్డు సాధించినందుకు ఆనందంగా ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా దాదాపు రెండు కోట్ల మంది.యోగాలో పాల్గొంటున్నారన్నారు. ఆంధ్రాను యోగాంధ్రగా మార్చడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని అజయ్ జైన్ పిలుపునిచ్చారు.

Read Also: Rice: పేద పిల్లలకు సన్న బియ్యంతో భోజనం

#KrishnaRiverYoga #WorldRecordYoga #YogaInVijayawada #YogaOnWatercraft Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.