📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

Yerrappa: నకిలీ ఇ స్టాంపు సూత్రధారి ఎర్రప్ప

Author Icon By Anusha
Updated: June 30, 2025 • 12:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎమ్మెల్యే సురేంద్రబాబు, ఎస్ఆర్సి ఇన్ఫ్రాకు క్లీన్ చిట్

అనంతపురం : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో బయటపడ్డ నకిలీ ఈ స్టాంపుల వ్యవహారంలో సూత్రధారిగా ఎర్రప్ప అలియాస్ మీ సేవ బాబు నిర్ధారణ అయింది. నకిలీ ఈ స్టాంపులు కేసులో స్థానిక టిడిపి, వైసీపీ నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నప్పటికీ ఈ స్కాంలో రెండు పార్టీల నేతల హస్తం లేదని, కర్త క్రియ 1 కర్మ అంతా కళ్యాణ్ దుర్గం లో మీసేవ నిర్వహిస్తున్న ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు దే అని అధికారులు తేల్చేశారు. పెద్ద ఎత్తున మీసేవ బాబు సంబంధించిన ఏజెన్సీ వద్ద ఈ స్టాంపు (E- stamp)లు కొనుగోలు చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్ ఏ లాంటి అవినీతికి పాల్పడలేదని, పక్కాగా ఆన్లైన్లో ఏజెన్సీ వారికి డబ్బులు చెల్లించే ఈ స్టాంప్స్ తీసుకున్నారని, అవినీతిలో వారు పాత్ర లేదని అధికారులు నిర్ధారించడం గమనించదగ్గ విషయం.

ఈ స్టాంపులుగా కంప్యూటర్లో టాంపరింగ్

తమ అవసరాల కోసం కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు కు చెందిన ఎస్సార్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్ వారు ఈ స్టాంపుల కోసం మీసేవ బాబుకు సంబంధించిన ఏజెన్సీకి 32 లక్షల రూపాయలను వివిధ బ్యాంకుల ద్వారా ఆన్లైన్లో చెల్లించింది. అయితే ఈ మొత్తంలో ఈస్టాంపుల కోసం మీసేవ నిర్వాహకుడు ప్రభుత్వానికి రూ.6.58 లక్షలే చెల్లించి ఎస్ఆర్ఇన్ ఫ్రాకు మీ సేవ నిర్వాహకుడు రూ. 25.48 లక్షలు మోసం చేశారు. నూరు రూపాయల ఈ స్టాంపులను లక్ష రూపాయల ఈ స్టాంపులుగా కంప్యూటర్లో (computer) టాంపరింగ్ చేసి చూస్తే ఒరిజినల్ ఈ స్టాంపులు ఉన్నట్లు మీసేవ బాబు చేసి వాటిని ఎస్సార్ శ్రీ ఇన్ఫా వారికి ఇస్తూ వచ్చారు. అవి ఒరిజినల్ ఈ స్టాంపులు మాదిరిగానే ఉండడంతో సహజంగానే తెలుసుకోలేక వాటిని వినియోగిస్తూ వచ్చారు.

Yerrappa:

అధికారులు సమాచారాన్ని అడిగినట్లు తెలుస్తోంది

ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు ఇప్పటివరకు 15,413 ఈస్టాంపులు విక్రయిస్తే అందులో 438 ఈ స్టాంపులను ఎస్ ఆర్ సి వారు కొనుగోలు చేసినట్లు వాటిలో 25.50 లక్షల మోసం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ స్టాంపులతో సంబంధం ఉన్న ఏజెన్సీలు, బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి పోలీస్ అధికారులు సమాచారాన్ని అడిగినట్లు తెలుస్తోంది. నకిలీ ఈ స్టాంపుల వ్యవహారంలో బోయ ఎర్రప్ప (Boya Yerrappa) అలియాస్ మీసేవ బాబు తోపాటు ఆయన సతీమణి కట్ట భార్గవి, కురుబ మోహన్ బాబు, భువనేశ్వరులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు కంప్యూటర్లు, లాప్టాప్, మూడు సీపీయులు, మూడు మానిటర్లు, మూడు ఫోన్లు, ఏడు వినియోగించిన స్టాంపులు, 88 ఖాళీ ఈ స్టాంపులను పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి విజప్తి చేసిన


ఇది ఇలా ఉండగా కళ్యాణ్ దుర్గం లో బయటపడ్డ నకిలీ ఈ స్టాంపులు వ్యవహారంలో ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవల పర్స్ లిమిటెడ్ సంస్థ ఎండి యశ్వంత్ స్పందిస్తూ ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా దర్యాప్తు చేయాల్సి ఉందని, ఇతర చోట్ల కూడా ఇలా నకిలీ ఈ స్టాంపుల ముఠాలు ఈ అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి విజప్తి చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఈజీగా ఉన్న ఐఏఎస్ అధికారి వీర పాండ్యన్ (Veera Pandyan) కూడా స్పందిస్తూ అన్ని జిల్లాల్లో తగు చర్యలు తీసుకోవాలని, నకిలీ ఈ స్టాం పులు ఎక్కడైనా సృష్టించారో తనిఖీలు చేయాలని ఆదేశించినట్లు సమాచారం.

Read Also: National Highway: ఏపిలో 10 జాతీయ రహదారులకు మహర్దశ

#AnantapurScam #APScamNews #CorruptionFreeAP #EStampFraud #FakeEStampScam #KalyandurgNews #MeesevaBabu #MeeSevaScam #PublicServiceTransparency Anantapur news updates Ap News in Telugu AP political scam news Breaking News in Telugu e-stamp fraud 2025 E-stamp fraud Andhra Pradesh fake e-stamp case Anantapur Google news Google News in Telugu Kalyandurg e-stamp scam Latest News in Telugu Meeseva Babu Kalyandurg scam Meeseva corruption case Meeseva scam in AP Paper Telugu News SRC Infra Developers e-stamp case Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.