हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Women Employees: ఏపీ మహిళా ఉద్యోగులకు శుభవార్త.. పిల్లల సంరక్షణకు క్రెష్‌లు ఏర్పాటు

Anusha
Women Employees: ఏపీ మహిళా ఉద్యోగులకు శుభవార్త.. పిల్లల సంరక్షణకు క్రెష్‌లు ఏర్పాటు

ప్రస్తుత సమాజంలో మహిళలు వివిధ రంగాల్లో ముందుకు వెళ్లుతున్నా, వారి ముందున్న సవాళ్లు మాత్రం ఇప్పటికీ తగ్గలేదు. ముఖ్యంగా పెరుగుతున్న జీవన ఖర్చులు, బలవంతంగా ఇద్దరు జీవిత భాగస్వాములూ ఉద్యోగాల్లో ఉండాల్సిన పరిస్థితిని తలపెట్టాయి. అయితే ఉద్యోగం చేసే మహిళలు కుటుంబ బాధ్యతలు కూడా సమాంతరంగా నిర్వహించాల్సిన కర్తవ్యంలో ఉంటారు. ఈ క్రమంలో చిన్న పిల్లలు ఉన్న తల్లులకు వృత్తిపరమైన జీవితం (Professional life) చాలా కష్టతరంగా మారుతోంది. పిల్లలు కాస్త పెద్దవాళ్లు అయితే పర్లేదు కానీ, నెలల పిల్లలలు ఉన్న తల్లులకు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం కత్తి మీద సాము లాంటిదే. ఇంట్లో పిల్లలను చూసుకునే వారు ఉంటే పర్లేదు, లేదంటే ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితి తలెత్తుంది. ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిజంగా ఇది మహిళా ఉద్యోగులకు పండగలాంటి వార్తే అని చెప్పవచ్చు. మహిళలు ఇటు జాబ్, అటు పిల్లల ఆలనాపాలనా చూసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పని ప్రదేశాల్లో క్రెష్‌లు (చిన్నారుల సంరక్షణ కేంద్రాలు) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

హెచ్ఓడీ కార్యాలయాలు

రాష్ట్రవ్యాప్తంగా 216 ప్రాంతాలను గుర్తించి, అక్కడ క్రెష్‌లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేస్తుంది. కేంద్ర సహకారం కోసం నివేదికను పంపింది.ఎక్కువ మంది మహిళా ఉద్యోగులు ఉన్న చోట అంటే సుమారుగా 100 మంది కంటే ఎక్కువ ఆడవారు పని చేస్తున్న చోట క్రెష్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాంటి అన్ని కార్యాలయాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. అన్ని హెచ్ఓడీ కార్యాలయాలు, కలెక్టరేట్‌లు, జిల్లా కోర్టులు, గవర్నమెంట్ ఆసుపత్రులు, మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయాలు (Municipal Corporation Offices), జిల్లా పంచాయతీ కార్యాలయాలు, పురపాలక ఆఫీసుల వద్ద క్రెష్‌లు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు. సాధ్యమైనంత వరకు ప్రభుత్వ భవనాల్లోనే ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.ఇందుకోసం అమరావతి సచివాలయంలో ఉన్న క్రెష్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఆరు నెలలు పైబడిన పిల్లలను ఈ క్రెష్‌లలో చూసుకుంటారు. పిల్లల సంరక్షణ కోసం ఒక కార్యకర్త, ఒక సహాయకురాలు ఉంటారు.

Women Employees: ఏపీ మహిళా ఉద్యోగులకు శుభవార్త.. పిల్లల సంరక్షణకు క్రెష్‌లు ఏర్పాటు
Women Employees

ఒక నివేదికను కూడా పంపింది

ఆట వస్తువులు, ఊయల, బరువు చూసే యంత్రం, బెడ్లు, రిఫ్రిజిరేటర్, మరుగుదొడ్లు, ఫర్నిచర్ వంటి సౌకర్యాలు ఉంటాయి. తల్లిదండ్రులు తెచ్చిన ఆహారాన్నే పిల్లలకు తినిపిస్తారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కొన్ని రోజుల క్రితం ఓ సమావేశంలో మాట్లాడుతూ, మహిళా ఉద్యోగుల కష్టాలను తొలగించడానికి పని ప్రదేశాల్లో క్రెష్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనిలో భాగంగానే మహిళా శిశు సంక్షేమ శాఖ మొదటి అడుగు వేసింది. వీటి ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం సహాయం కోరుతున్న ఏపీ గవర్నమెంట్ వీటికి సంబంధించి ఒక నివేదికను కూడా పంపింది. ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో మహిళా ఉద్యోగినులకు ఊరట లభించనుంది. ఇక పిల్లల గురించి చింత వదిలేసి తాము చేసే పని మీద దృష్టి పెట్టగలుగుతారని అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Fake doctor : కార్డియాలజిస్ట్‌గా అవతారమెత్తిన నకిలీ వైద్యుడి కలకలం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870