📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Pawan Kalyan: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు పవన్ కల్యాణ్ వార్నింగ్ ఎందుకంటే?

Author Icon By Anusha
Updated: May 7, 2025 • 3:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆపరేషన్ సిందూర్ పేరుతో పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది.బుధవారం ( మే 7, 2025 ) అర్ధరాత్రి పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పిఓకే ) లోని ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు నిర్వహించింది.ఒక రాత్రిలోనే మూడు టెర్రర్‌ హెడ్‌క్వార్టర్స్‌ నేలమట్టం చేసింది. పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడిపై ప్రతీకారంగా మురిడ్కేలో భారత ఆర్మీ దాడులు చేసింది.ఈ ఆపరేషన్‌లో మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై లక్ష్యంగా దాడులు జరపగా సుమారు 30 మంది ఉగ్రవాదులు హతమయినట్టు సమాచారం. భారత ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి.పాకిస్తాన్ తో పాటుగా పీఓకే లోని ఉగ్రవాద శిబిరాల పైన అర్ద్రరాత్రి భారత సైన్యం మెరుపు దాడి చేసింది. డ్రోన్లు, క్షిపణులతో భారత ఏయిర్ ఫోర్స్ విరుచుకుపడింది. ఉగ్రవాద శిబిరాల పైన పక్కా సమాచారంతో గురి పెట్టి మరీ భారత సైన్యం, క్షిపణులు ప్రయోగించింది. ఉగ్రవాద శిబిరాల పైన భారత్ సైన్యం దాడులను దేశ వ్యాప్తంగా అందరూ సమర్థిస్తున్నారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా 2019లో బాలాకోట్‌ తర్వాత పాక్ సరిహద్దుల్లోకి వెళ్లి భారత్ చేసిన అతిపెద్ద దాడి ఇదే.

అనుకూలంగా

ప్రధాని మోదీ నేతృత్వంలో ధీటుగా బదులిచ్చామని భారత్‌పై ఎవరు దాడి చేసినా సహించేదిలేదంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో అంతా దేశానికి అండగా ఉండాలి, ప్రతి ఒక్కరూ మోదీకి మద్దతుగా నిలవాలంటూ కోరారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు కూడా పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరూ పోస్టులు పెట్టొద్దు దేశ భద్రత విషయంలో ఇన్‌ఫ్లుయెన్సర్లు జాగ్రత్తగా మాట్లాడాలంటూ కోరారు. లేకపోతే చర్యలు తప్పవంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు తరచూ మాటలు మారుస్తున్నారని,కొందరు పాక్‌కు అనుకూలంగా మాట్లాడారని, వారిని ఉద్దేశించే గతంలో మాట్లాడనంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తీవ్రవాదాన్ని పూర్తిగా అణచివేయాల్సిందేనన్నారు.ఏపీలో ఇద్దరు మరణించారు.హిందువులా కాదా అని అడిగి మరి చంపారని పవన్ కల్యాణ్ అన్నారు.హిందువులపై దశాబ్దాలుగా దాడి జరుగుతునే ఉందన్నారు.మోదీ తీసుకున్న నిర్ణయం పట్ల అందరం గర్వించాలని,మోదీ నాయకత్వంలో ఉగ్రవాదంపై యుద్ధం జరుగుతుందన్నారు. సోషల్ మీడియాలో ఎవరైన దేశాన్ని కించపరిచేలా మాట్లాడితే కేసులు పెట్టాల్సిందేనన్నారు.ఉగ్రవాదిని అంతం చేసే వరకు మోదీ పోరాటం ఆగదన్నారు.ఇలాంటి సమయంలో అందరం దేశం కోసం ఆలోచించాలి, పార్టీల కోసం కాదన్నారు. పాకిస్థాన్ కు మద్దతుగా ఆలోచించే నాయకులు తమ వైఖరి మార్చుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు.

సమాచారం

ఏపీలో తీర ప్రాంతం మరింత అప్రమత్తంగా ఉండాలి, ఏపీకి కేంద్రం ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉందన్నారు. కొంతమంది కాంగ్రెస్ నాయకుల మాటలు విన్నాను,ఇలాంటి సమయంలో ప్రభుత్వాన్ని అండగా నిలబడాలి,పాకిస్తాన్ కి ప్రోత్సాహంగా మాట్లాడడం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉంటే మంచిది అని సూచించారు. గాంధీ మార్గం అని చెప్పి, సహనమని చెప్పి,హిందువులను చంపితే భరించాలా, అంటూ పవన్ ప్రశ్నించారు.

Read Also: India Pakistan War: మోర్టార్ షెల్స్‌తో సాధారణ పౌరులపై పాక్ దుశ్చర్యలు

#InfluencersBeResponsible #NationFirst #PawanKalyan #SocialMediaWarning #SupportModi Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.