📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Quantum Valley: దేశంలోనే తొలిసారిగా క్వాంటం వ్యాలీ ఎక్కడంటే?

Author Icon By Anusha
Updated: May 11, 2025 • 1:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ రాజధాని అమరావతిలో దేశంలోనే మొదటి క్వాంటం వ్యాలీ టెక్ పార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అమరావతి క్వాంటం వ్యాలీ కోసం ఐబీఎం, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఇటీవలే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఐబీఎం, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు,రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. 2026 జనవరి ఒకటి నుంచి అమరావతి కేంద్రంగా క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు(CM Chandrababu) కూడా ప్రకటించారు. అనంతరం అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటు కోసం ప్రభుత్వం భూమిని కూడా కేటాయించాలని నిర్ణయించింది. క్వాంటం వ్యాలీ ఏర్పాటు కోసం 50 ఎకరాలు కేటాయించాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది.అమరావతి క్వాంటం వ్యాలీ టెక్ పార్కును ఉద్ధండరాయునిపాలెం, లింగాయపాలెం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనునట్లు తెలుస్తోంది. ఈ గ్రామాల పరిధిలో 50 ఎకరాల్లో క్వాంటం వ్యాలీ టెక్ పార్కును ఏర్పాటు చేసే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు, కరకట్ట రోడ్డు మధ్య భాగంలో 50 ఎకరాల్లో క్వాంటం వ్యాలీ టెక్ పార్కు(Quantum Valley Tech Park)ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటైతే,దేశంలోనే తొలి అత్యాధునిక క్వాంటమ్‌ వ్యాలీ టెక్‌ పార్కు అవుతుంది.

దేశంలోనే తొలిసారిగా క్వాంటం వ్యాలీ

నిర్ణయం

మరోవైపు అమరావతిలో వివిధ సంస్థలకు ఏపీ ప్రభుత్వం ఇటీవల భూములు కేటాయించింది. ఈ క్రమంలోనే అమరావతిలో లా యూనివర్సిటీ, క్వాంటం వ్యాలీ ఏర్పాటు కోసం 50 ఎకరాలు చొప్పున కేటాయించారు. అలాగే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఇప్పటికే కేటాయించిన 15 ఎకరాలకు అదనంగా మరో 6 ఎకరాలు కేటాయించింది. అమరావతిలో బసవతారకం ఆస్పత్రికి ఇప్పటికే 15 ఎకరాలు కేటాయించారు. తాజాగా బసవతారకం మెడికల్‌ కాలేజీకి 6 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఐఆర్‌సీటీసీ కోసం ఎకరా భూమిని, ఆదాయపు పన్ను శాఖకు 0.78 ఎకరాలు, రెడ్‌క్రాస్‌ సొసైటీకి 0.78 ఎకరాలు, కోస్టల్‌ బ్యాంక్‌ కోసం 0.40 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుంది.

Read Also :Kanipakam Temple : కాణిపాకం వీఐపీ దర్శనం టికెట్ ధర పెంపు

#AmaravatiTechPark #FutureOfAndhra #QuantumValley #TechInAmaravati Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.