📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Andhra Pradesh: ఏపీలో కొత్తగా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఎక్కడంటే?

Author Icon By Anusha
Updated: May 9, 2025 • 1:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ గవర్నమెంట్ అమరావతిపై ఫుల్ ఫోకస్ పెట్టింది.తాజాగా అమరావతిలో స్పోర్ట్స్ సిటీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ జిల్లాలోని కృష్ణా నదికి దగ్గరగా ఉన్న నాలుగు గ్రామాలను రాజధాని పరిధిలోకి తీసుకురానున్నారు. త్రిలోచనాపురం, మూలపాడు, కోటికలపూడి, జమీమాచవరం గ్రామాలను ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో భూములను సేకరించేందుకు గ్రామసభలు నిర్వహించారు.రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించారు. స్పోర్ట్స్ సిటీ కోసం ఈ నాలుగు గ్రామాలను ఎంచుకున్నారు. ఇటీవల కృష్ణా నదిలో ఉన్న చినలంక, పెదలంక దీవులను పరిశీలించారు.కానీ అవి వరదలకు మునిగిపోయే అవకాశం ఉంది.అందుకే వాటిని వద్దనుకున్నారు. వాటికి దగ్గరలో ఉన్న ఈ నాలుగు గ్రామాలను ఎంపిక చేశారు.మూలపాడులో ఇప్పటికే రెండు క్రికెట్ స్టేడియాలు(Cricket Stadium) ఉన్నాయి.ఈ ప్రాంతం స్పోర్ట్స్ సిటీకి అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. మూలపాడు నుంచే అమరావతికి గ్రాండ్ ఎంట్రెన్స్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు. కృష్ణా నది మీదుగా ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. అందుకే ఈ నాలుగు గ్రామాలను ఎంచుకున్నట్లు సమాచారం. మూలపాడులోనే అంతర్జాతీయ క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది.గ్రామసభల్లో రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. త్వరలోనే స్పోర్ట్స్ సిటీ(Sports City) నిర్మాణం దిశగా అడుగులు పడనున్నాయి. ఈ స్పోర్ట్స్ సిటీతో పాటుగా అక్కడే దేశంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంను నిర్మించాలని కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అక్కడ 2వేల ఎకరాల వరకు సేకరించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మాణంపై అధ్యయనం కోసం ఇటీవల మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఓ టీమ్ గుజరాత్‌లోని అహ్మదబాద్ క్రికెట్ స్టేడియాన్ని కూడా పరిశీలించారు.

Andhra Pradesh: అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

అభివృద్ధి

ఇంకొక వైపు పల్నాడు జిల్లాలో రాజధాని అమరావతి అవసరాల కోసం ప్రభుత్వం రెండో విడత భూసేకరణ చేపట్టింది. పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి మండలంలో రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకం ఉందని రైతులు గ్రామసభలో చెప్పారు. మొత్తం 9,617.58 ఎకరాల భూమిని సేకరించడానికి ప్రభుత్వం రైతుల అభిప్రాయాలను తెలుసుకుంటోంది. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో గ్రామసభలు జరిగాయి.రైతులు రాజధాని అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.ఏపీ ప్రభుత్వం అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి గ్రామాల్లో సభలు నిర్వహించింది. కర్లపూడి, లేమల్లె గ్రామాల్లో బుధవారం గ్రామసభలు జరిగాయి. ఈ సభల్లో రైతులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ముఖ్యమంత్రి రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారని ఎమ్మెల్యే ప్రవీణ్ అన్నారు. రైతుల కోసం ప్రభుత్వం అనేక పథకాలు తీసుకువస్తుందని ఆయన చెప్పారు. రాజధానిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల గురించి రైతులు అడిగారు. ఇప్పుడు సేకరించే 10 వేల ఎకరాల్లో ఎలాంటి అభివృద్ధి చేస్తారో చెప్పాలని కోరారు. ఐటీ కంపెనీలు విశాఖకు, పరిశ్రమలు శ్రీసిటీకి కేటాయిస్తున్నారని ముఖ్యమంత్రి చెబుతున్నారని రైతులు అన్నారు. అమరావతిలో ఏ కంపెనీలు తీసుకొచ్చి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తారో ప్రకటించాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నా అమరావతి రాజధాని అని గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని రైతులు ప్రశ్నించారు.

Read Also :Security: సీఎం చంద్రబాబు భద్రతపై డీజీపీ కీలక ఆదేశాలు

#AmaravatiCapital #AmaravatiDevelopment #AndhraPradesh #KrishnaRiver #SportsCity Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.