📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

WhatsApp Governance: ప్రారంభమైన రేషన్ కార్డు సేవలు

Author Icon By Anusha
Updated: May 25, 2025 • 4:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీలో రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ జోరుగా సాగుతుంది. రేషన్ కార్డుల కోసం భారీ ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. కొత్త కార్డులు, కార్డు విభజన, కొత్త సభ్యుల చేరిక వంటి వాటి కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే రద్దీ ఎక్కువగా ఉండటంతో సర్వర్లు బిజీ వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్‌లో కూడా రేషన్ కార్డు(Ration card)ల సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. శనివారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వాట్సాప్‌లో రేషన్ కార్డు సేవలు పొందాలంటే 9552300009 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేయాలి.అయితే ఇదేమి కొత్త నంబర్ కాదు. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మనమిత్ర (వాట్సాప్‌ గవర్నెన్స్‌) సర్వీసే. దీనిలో ఇకపై రేషన్ కార్డు సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారా రేషన్ కార్డులో మార్పుచేర్పులు, ఇతర సేవలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభించనుంది. అయితే ఇందులో 8 రకాల సేవ(8 types of service)లు ఉన్నప్పటికీ ముఖ్యమైన కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. దీంతో దరఖాస్తుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్‌లో రేషన్ కార్డు సేవలు అందుబాటులోకి వచ్చినా కొత్త కార్డుకు అప్లై చేసుకోవాలంటే మాత్రం సచివాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది.

WhatsApp Governance: ప్రారంభమైన రేషన్ కార్డు సేవలు

కొత్తకార్డు

దీనికి పరిష్కారంగా ప్రభుత్వం ఆన్‌లైన్‌లో రేషన్ కార్డు దరఖాస్తులు సమర్పించడానికి వీలుగా ‘మనమిత్ర’ (వాట్సాప్‌ గవర్నెన్స్‌) సేవలను ఈ నెల 15 నుంచే అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. చివరకు శనివారం నుంచి వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవ(WhatsApp Governance Service)లు అందుబాటులోకి వచ్చాయి. కొత్త కార్డుకు అప్లై చేసుకునేవారు మినహా మిగిలిన వారు ఇంటి నుంచే తమకు కావాల్సిన రేషన్ కార్డు సేవల కోసం అప్లై చేసుకోవచ్చు.

Read Also: Terrorism: విజయనగరం ఉగ్రకుట్రలో తెరపైకి సంచలన విషయాలు

#AndhraPradesh #RationCard #WhatsAppServices Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.