📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

మిర్చి మార్కెట్ లో కల్లోలం ఏపీలో ప్రస్తుతంధరలు ఎలా ఉన్నాయి.

Author Icon By Anusha
Updated: February 19, 2025 • 6:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ లో మిర్చి ధర పతనం పొలిటికల్‌గా ఘాటెక్కిస్తోంది. అధికార, విపక్షాల విమర్శలు, ప్రతివిమర్శలతో మరింత మంట పుట్టిస్తోంది. ఇక వైసీపీ అధినేత జగన్‌ గుంటూరు మిర్చి యార్డ్‌ సందర్శనతో పీక్‌ స్టేజ్‌కు చేరింది. అయితే సీఎం చంద్రబాబు ఇప్పటికే తన మార్క్ యాక్షన్ ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు.గత సీజన్ వరకు మిర్చి ధర 21వేలకు పైగా పలికింది. అయితే.. సడెన్‌గా 13 వేలకు పడిపోవడం రైతులకు షాకిచ్చింది. అంతేకాదు క్వాలిటీ లేదంటూ కొన్ని చోట్ల తొలి కోత కాయ కూడా 10 వేలు నుంచి 12 వేలకే అడుగుతున్నారు. దాంతో మహమ్మారి తెగుళ్ల నుంచి పంటను కాపాడుకున్న మిర్చి రైతులు లబోదిబోమంటన్నారు. ధర పతనంతో ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్‌ గుంటూరు మిర్చి యార్డ్‌ను సందర్శించడం కాకరేపింది. మిర్చి రైతులను పరామర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా.. మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జగన్‌. 13వేల ధరతో మిరప రైతులకు పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి నెలకొందన్నారు. వెంటనే పంటలకు మద్దతు ధరలు కల్పించాలని.. లేనిపక్షంలో రైతుల తరపున పోరాటాలకు దిగుతామని జగన్‌ హెచ్చరించారు.

సీఎం చంద్రబాబు సమీక్ష – కేంద్రానికి లేఖ

రైతుల ఆందోళనలతో మిర్చి ధరలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. మిర్చి రైతులను ఆదుకోవాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. ధరల స్థిరీకరణ నిధి కింద రేటు పెంచాలని విజ్ఞప్తి చేశారు. వర్షాల కారణంగా ఏపీలో మిర్చి పంటలు దెబ్బతిన్నాయని మిర్చి రైతుల సమస్యను ప్రత్యేక కేసుగా గుర్తించాలని కేంద్రాన్ని కోరారు. రేపు (ఫిబ్రవరి 20) ఢిల్లీ పర్యటనలో మిర్చి రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు

మిర్చి రైతుల విషయంలో జగన్‌ కామెంట్స్‌పై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు రియాక్ట్‌ అయ్యారు. జగన్‌ తీరు కరెక్ట్‌ కాదని.. మిర్చికి మద్దతు ధర పెడితే అంతకుమించి రేటు పలకదని గుర్తుంచుకోవాలన్నారు. మిర్చి రైతుకు ఎక్కువ మేలు చేయాలనేదే తమ ప్రయత్నమని.. కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు.

గుంటూరు మిర్చి యార్డు పేరు దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత సాధించింది. దేశంలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్‌గా పేరుగాంచిన ఈ యార్డు, 11 ఎకరాల విస్తీర్ణంలో, 1956లో స్థాపించబడింది. అప్పటి నుంచి మిర్చి రైతులకు, వ్యాపారులకు ఒక ముఖ్యమైన కేంద్రంగా మారింది. మిర్చి ఉత్పత్తి, ధరల విషయంలో గుంటూరు మార్కెట్ దేశవ్యాప్తంగా ప్రామాణికంగా మారింది.ప్రతి సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్లలో మిర్చి రైతులు తమ పంటను ఈ మార్కెట్‌కి తీసుకువచ్చి విక్రయిస్తారు. గుంటూరు మార్కెట్‌లో జరిగే లావాదేవీలే దేశ వ్యాపారానికి దిశా నిర్దేశం చేస్తాయి.

#Achchennaidu #AgricultureCrisis #AndhraPradesh #APPolitics #ChandrababuNaidu #FarmersSupport #FarmersWelfare #MirchiFarmers #MirchiPriceDrop #TDP #ycp #YSJagan Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.