📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Visakhapatnam: పౌర సేవల్లో విశాఖ టాప్

Author Icon By Anusha
Updated: June 30, 2025 • 11:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

74.4 శాతంతో ముందంజ

విజయవాడ: పౌరసేవలను మరింత ప్రభావవంతంగా ప్రజలకు చేరువ చేసేందుకు సేవాస్థాయి ఫలితాలను కొలిచే ఒక సరికొత్త వ్యవస్థను అమలులోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్బన్ లోకల్ బాడీలు (యూఎల్బీలు) తొలుత కనీసం పది వేర్వేరు సేవా ప్రమాణాల ఆధారంగా ర్యాంకింగ్ చేయబడతాయి, ఆ ఫలితాల ఆధారంగా పనులు రూపొందించబడతాయి. రాష్ట్ర సగటు ర్యాంకింగ్ (100 స్కేలులో) 66.3 శాతంగా ఉండగా, విశాఖపట్నం జిల్లా 74.4 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది, తరువాత ఎన్టీఆర్ 72.6 శాతంతో ఉంది. తిరుపతి (66.2 ), తూర్పు గోదావరి (64 శాతం), అనంతపురం (62 శాతం), వైఎస్ఆర్ కడప (61.7 శాతం), పల్నాడు (61.4 ),(60.4 ) కర్నూలు (60.3 శాతం) సేవాస్థాయి ర్యాంకింగ్లలో ఇతర టాప్ పర్ఫార్మర్లుగా నిలిచాయి. అనకాపల్లి జిల్లా 51.8 శాతం స్కోర్తో చార్ట్లో అట్టడుగున ఉంది. యూఎల్బీల (ULB) లో సేవల అందించడం నిర్ణీత కాలపరిమితుల ప్రకారం నెరవేరేలా రాష్ట్ర పురపాలక పట్టణాభి వృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ కొత్త వ్యవస్థను రూపొందించారు.

వర్షపు నీటి కాలువల నిర్మాణం

సురేష్ కుమార్ నాయకత్వంలో పౌరుల ఆకాంక్షలను నెరవేర్చడానికి, పట్టణ సమస్యలను పరిష్కరించడంలో మొట్టమొదటిసారిగా కేంద్రీకృత విధానాన్ని ఎంఎ యూడీ శాఖ అవలంబిస్తోంది. యూఎల్బీలలో ప్రధాన సేవాస్థాయి సూచికలలో ఇంటింటికీ నీటి కనెక్షన్ల ద్వారా తాగునీటి సరఫరా, ఇంటింటికీ చెత్త సేకరణ, వ్యర్థాల ప్రాసెసింగ్, పాత వ్యర్థాల నిర్వ హణ, మురుగునీటి శుద్ధి, వర్షపు నీటి కాలువల నిర్మాణం, పక్కా రోడ్లు, (ఎల్ డి) స్ట్రీట్ లైటింగ్, పట్టణ (మహిళా) స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులకు ఆదాయం కలిగించే కార్యకలాపాలు,మున్సిపల్, రెవెన్యూశాఖ ఉన్నాయి. పట్టణ సేవల సామర్థ్యాన్ని నిర్ధారించడంతో పాటు, ఈ సరికొత్త వ్యవస్థ ఉత్తమ ఫలితాలను సాధించడానికి ,వనరులను సరైన వినియోగానికి తోడ్పడుతుంది.

Visakhapatnam:

మున్సిపల్ కార్పొరేషన్ల కార్పొరేటర్లతో పాటు

ఈ కొత్త చొరవను ర్యాంకింగ్ విధానాన్ని అభినందించిన ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, సేవాస్థాయి సూచికల గురించి ఎమ్మెల్యేలకు, జిల్లా కలెక్టర్లకు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ కార్పొరేషన్ల కార్పొరేటర్ల తో పాటు మున్సిపాలిటీల చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్ల Councilors) కు పూర్తి అవగాహన కల్పించాలని ఎంఏయూడీ శాఖ అధికారులను ఆదే శించారు. యూఎల్బీలలోని ఎన్నికైన ప్రతినిధులు, శాసనసభ్యులు జిల్లా కలెక్టర్లు ఈ దిశగా పనిచేసి, సేవాస్థాయి సూచికలకు అనుగుణంగా ఉన్న పనులుమాత్రమే చేపట్టేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు.

నిర్ణీత కాలపరిమితుల ప్రకారం పూర్తి చేయాలని

ఎంఏయూడీ శాఖ ముఖ్య కార్యదర్శి నిర్ణ యించిన కాలపరిమితులను ప్రశంసిస్తూ, ప్రతిపాదిత పనులన్నీ నిర్ణీత కాలపరిమితుల ప్రకారం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశిం చారు. ఎంఏయూడీ శాఖ (MAUD Department) ఇప్పుడు సేవల అందించడాన్ని అభివృద్ధి పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించడానికి రియల్టైమ్ డాష్బర్డ్ను అభివృద్ధి చేస్తోంది. ఎంఏయూడీ శాఖ రంగాల వారీ సేవల ఆధారంగా మొదటి దశ ర్యాంకింగ్ ప్రక్రియను పూర్తి చేసింది.

Read Also: Swetcha: స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో.. తెరపైకి పూర్ణచందర్ భార్య

#AndhraPradeshNews #PublicServiceDelivery #SmartCitiesIndia #UrbanGovernance Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.