📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Viral Video: Kaikalur- కైకలూరులో రగులుతున్న కుల చిచ్చు..

Author Icon By Digital
Updated: September 18, 2025 • 12:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాపు, ఎస్సీల మధ్య ఆధిపత్యపోరు.. మరో కారంచేడు కానున్నదా?

Kaikalur news: ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ (ఏఐ) నాగరికతలో జీవిస్తున్న మనం ఇంకా బూజుపట్టిన భావజాలంలోనే మగ్గిపోవడం విచారకరం. ఒకవైపు ఉన్నత విద్య, ఉపాధి కోసం మన పిల్లల్ని విదేశాలకు పంపిస్తున్నాం. మతాలకు, కులాలకు అతీతంగా క్రైస్తవదేశాలు, ముస్లిందేశాలు, కమ్యూనిస్టు దేశాలనే బేధం లేకుండా పంపిస్తున్నాం.

అప్పుడు అడ్డురాని కులం, మతభావం, జాతీ విభేదాలు ఇప్పుడు ఇక్కడెందుకు వస్తున్నాయి? మతం, కులం ఇవన్నీ మనల్ని అధఃపాతాళానికి తీసుకెళ్లేవే. మతకన్నా మానవత్వం మిన్న అనే విషయం మనకు తెలిసినా ఆచరణలో మాత్రం దీనికి భిన్నంగా ప్రవర్తిస్తాం.

ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని ఓ ప్రాంతంలో రెండు తెగలమధ్య జరుగుతున్న పోరులో సామాన్యప్రజలు నలిగిపోతున్నారు. ఆ వివరాలు ఏమిటో మీరే చదవండి.

నెల్లూరు జిల్లాలోని కైకలూరులో రెండు కులాల మధ్య చిచ్చు

నెల్లూరు జిల్లాలోని కైకలూరు(Kaikalur) రెండు కులాల మధ్య గతకొన్ని రోజులుగా నివురుగప్పిన నిప్పులా చెలరేగుతున్నాయి. గతకొన్ని రోజుల క్రితం కైకలూరులో కాపు కులస్తులకు, ఎస్సీకులస్తులకు మధ్య విభేదాలు వచ్చి స్వల్పంగా ఘర్షణకు దిగారు.

దాంతో ఇరువర్గాల పెద్దలు కూర్చోని, భవిష్యత్తులో ఇలాంటి గొడవలు జరగకుండా చూసుకుందామని మాట్లాడుకున్నారు. ఈ సంఘటన పోలీసుల వరకు వెళ్లడంతో పోలీసులు కూడా ఈ విషయం సున్నితమైనది కావడంతో రెండువర్గాల మధ్య నిఘాను పెట్టి, పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.

అయితే ఈనెల వినాయక విగ్రహం నిమర్జనంలో ఊరేగింపులో ఎస్సీకి చెందిన ఓ వ్యక్తి కాపు ఊరేగింపులోకి వచ్చాడు. దీంతో కాపు కులస్తులు ఆ వ్యక్తిపై దాడి చేయడం, దీనికి రివెంజ్ ఎస్సీ వారు ప్రతి దాడి చేయడంతో కాపు, ఎస్సీల మధ్య గొడవలు జరిగాయి.

దీంతో ఒకరిపై ఒకరు కేసులను పెట్టుకున్నారు. కాపు కులస్తులు తమ మార్గంలో ఎస్సీలు రాకూడదని హుకుం జారీ చేయడంతో ఇది మరో కారంచేడు, చుండూరు సంఘటనకు దారితీస్తుందేమో అని ఇక్కడి ప్రజలు భయపడుతున్నారు.

ఉద్రిక్త పరిస్థితిపై ఆందోళన

Kaikalur: ఏలూరు డిఎస్పీ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే ఎస్సీలు మాత్రం తమకు అన్యాయం జరుగుతున్నదని, కాపుల మార్గంలో నడిచేందుకు తమకు అనుమతి ఇవ్వడం లేదని వాపోతున్నారు.

ఈ ఉదంతం మీడియా కూడా పెద్దగా కవర్ చేయకపోవడం గమనార్హం. ఏదిఏమైనా పాలకులు, ప్రజాప్రతినిధులు ఈరెండు వర్గాల మధ్య జరుగుతున్న విభేదాలను శాశ్వతంగా పరిష్కరించి, ప్రజలు శాంతియుతంగా జీవించేందుకు దోహదం చేయాలని కోరుతున్నారు.

Read aslo:

https://vaartha.com/hyderabad-tearfully-waiting-for-the-chance-to-see-a-corpse/telangana/549536/

Andhrapresh news today AP News Ap News in Telugu Kaikalur Kaikalur news Latest News in Telugu Today AP news Viral Video

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.