📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Andhra Pradesh: జూన్ 2 నుండి విజయవాడ బెంగళూర్ విమానసేవలు

Author Icon By Anusha
Updated: May 10, 2025 • 1:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీపికబురు చెప్పింది.రాష్ట్రం నుంచి కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి. ఏపీ నుంచి అబుదాబి, బెంగళూరు, భువనేశ్వర్‌లకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) తెలిపారు. రాష్ట్రంలో విమాన కనెక్టివిటీని పెంచడానికి ఈ కొత్త విమానాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం-అబుదాబి మధ్య విమాన సర్వీసులు జూన్ 13 నుంచి ప్రారంభమవుతాయని,ఈ విమానాలు వారానికి నాలుగు రోజులు నడుస్తాయన్నారు. దీని ద్వారా యూఏఈ, ఇతర దేశాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుంది అంటున్నారు.విశాఖపట్నం-భువనేశ్వర్ విమాన సర్వీసు జూన్ 12 నుంచి మొదలవుతుందని,విజయవాడ-బెంగళూరు మధ్య ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు జూన్ 2 నుంచి అందుబాటులో ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)’కనెక్టెడ్ ఆంధ్రప్రదేశ్’ కలను నెరవేర్చేందుకు కొత్త విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విజయవాడ నుంచి బెంగళూరుకు జూన్ 2 నుంచి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు నడుస్తాయని,దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం నుంచి బెంగళూరుకు సులువుగా చేరుకోవచ్చు అన్నారు. విమానయాన సర్వీసుల విస్తరణతో రాష్ట్రమంతటా కనెక్టివిటీని పెంచేందుకు కొత్త విమానాలను ప్రారంభిస్తున్నామని, దీని ద్వారా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది అంటున్నారు.

విజయవాడ బెంగళూర్ విమానసేవలు

ప్రస్తుతం

రాష్ట్రంలోని ప్రజలకు మరింత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు, కొత్త విమాన మార్గాలు,ఆధునిక సదుపాయాలతో కూడిన సేవలపై దృష్టిసారిస్తున్నామని ఆయన చెప్పారు.మరోవైపు విజయవాడ నుంచి విశాఖపట్నంకు జూన్‌ 1 నుంచి నూతన విమాన సర్వీసును ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇండిగో సంస్థ (Indigo Company)ఈ సర్వీసును నిర్వహించనుంది. ఈ విమాన సర్వీసు ఉదయం 7:15కు విజయవాడలో బయలుదేరి విశాఖకు ఉదయం 8:25కు చేరుకుంటుందని పౌర విమానయానశాఖ మంత్రి కె రామ్మోహన్‌నాయుడు తెలిపారు. మళ్లీ తిరుగు ప్రయాణంలో అక్కడి నుంచి 8:45కు బయలుదేరి విజయవాడకు 9:45కు తిరిగివస్తుందన్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఉదయం వేళ విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు ప్రస్తుతం చెన్నై నుంచి వచ్చి వెళ్లే ఒక్క సర్వీసు మాత్రమే నడుస్తోంది. ‘చెన్నై నుంచి విజయవాడకు(Vijayawada)ఉదయం 8.05కు వచ్చి, ఇక్కడి నుంచి 8.45కి బయలుదేరి విశాఖ వెళుతోంది. ఇందులో రద్దీ ఎక్కువగా ఉండటంతో చాలామంది విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లి, అక్కడి నుంచి విశాఖకు వెళ్లాల్సి వస్తోంది’ అంటున్నారు. ఈ క్రమంలో కొత్త సర్వీస్ ప్రారంభించారు.

Read Also :Security: జగన్ జడ్ ప్లస్ సెక్యూరిటీ కోసం హైకోర్టు లో పిటీషన్

#AbuDhabiFlights #AndhraPradesh #BengaluruFlights #NewFlightRoutes #VijayawadaFlights #VisakhapatnamFlights Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.