📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Vijayasai Reddy: పాకిస్తాన్ కి ఎలా బుద్ది చెప్పాలో మోడీ కి విజయసాయిరెడ్డి సలహా

Author Icon By Anusha
Updated: April 26, 2025 • 4:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ పదవికీ, రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన విజయసాయిరెడ్డి ఇప్పుడు రోజుకో రకంగా వార్తల్లో నిలుస్తున్నారు.నిన్న మొన్నటి వరకూ వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కాంపై సంచలన విషయాలు బయటపెట్టిన సాయిరెడ్డి ఇప్పుడు కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిపై స్పందించారు. ప్రధాని మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి ఓ కీలక సలహా ఇచ్చారు. పాకిస్తాన్ పీచమణచాలంటే కేంద్రం ఏం చేయాలో సాయిరెడ్డి చెప్పేశారు.భారత్ లో సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తీరును తప్పుబడుతూ వైసీపీ మాజీ ఎంపీ సాయిరెడ్డి ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు? దావూద్ ఇబ్రహీం ఎక్కడ నివసిస్తున్నాడు? మసూద్ అజార్ ఎక్కడ దాక్కున్నాడు? ఒకే సమాధానం పాకిస్తాన్ అని సాయిరెడ్డి తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాద ఎగుమతిదారు పాకిస్తాన్ అన్నారు.

వీరోచితంగా

దీనికి విరుగుడుగా భారత్ ఏం చేయాలో సాయిరెడ్డి సలహా ఇచ్చారు. భారతదేశం బలూచ్ ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని సాయిరెడ్డి కోరారు. అలాగే పాకిస్తాన్ నుండి పుట్టిన కొత్త దేశాలతో 1971ని పునరావృతం చేయాలంటూ కేంద్రానికి సూచించారు. పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ పై 1971 తరహాలోనే మరోసారి యుద్దం చేయాలంటూ దేశంలో డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి కూడా అదే డిమాండ్ చేసారు.1971లో పాకిస్తాన్ పై వీరోచితంగా యుద్దం చేసిన భారత సేనలు.. ఆ దేశంలోని తూర్పు భాగాన్ని వేరు చేసి బంగ్లాదేశ్ గా ఏర్పాటు చేశాయి. అప్పట్లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన ఈ యుద్ధం చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు దాన్నేకొత్త మిత్రులైన పష్తూన్ ( పాక్-ఆప్ఘన్ సరిహద్దుల్లో ఉన్న గిరిజనులు), బలోచ్ (పాకిస్తాన్ గిరిజన ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు)తో కలిసి రిపీట్ చేయాలని సాయిరెడ్డి కోరుతున్నారు. సాయిరెడ్డి డిమాండ్ పై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

కళ్లెదుటే

జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదుల కాల్పుల్లో త్రుటిలో బయటపడిన కొందరు అక్కడ పరిస్థితి చూసి భయంతో వణికిపోయారు. ప్రత్యక్షంగా ముష్కరుల మారణహోమాన్ని చూసిన వారు కొండలు, గుట్టల్లో పరిగెత్తుకుంటూ వచ్చి కుప్పకూలిపోయారు. తమ కళ్లెదుటే కన్న బిడ్డలను, కట్టుకున్నవాళ్లను, తోబుట్టువులను, బంధువులను, స్నేహితులను కోల్పోయిన బాధతో గుండెలవిసేలా రోదించారు. ముష్కర మూకల దాడి తర్వాత తమను కాపాడటానికి వచ్చిన ఇండియన్ ఆర్మీ జవాన్లను చూసి కూడా భయాందోళనకు గురయ్యారు.

Read Also: Kurnool Government Hospital : కర్నూల్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో అరుదైన చికిత్స

#BreakingNews #KashmirAttack #PoliticalExit #VijayasaiReddy #ycp Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.