हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Vande Bharat: జెట్​ స్పీడ్​లో వందేభారత్‌ పనులు

Anusha
Vande Bharat: జెట్​ స్పీడ్​లో వందేభారత్‌ పనులు

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో రెండున్నర నెలల కిందట ప్రారంభించిన వందేభారత్‌ నిర్వహణ డిపో(Depot) జూన్​లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. దీనిని రైల్వే జీఎం చేత ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వన్‌టౌన్‌ పాల ఫ్యాక్టరీ దగ్గరలోని రైల్వే యార్డులో డిపో(Depot in the railway yard)ను నూతనంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే పిట్‌లైన్‌ పనులు పూర్తయ్యాయి. అదేవిధంగా అధికారుల పరిపాలనా భవనం పనులు తుది దశకు చేరుకున్నాయి. అత్యాధునిక లైటింగ్‌ వ్యవస్థ, విశాలమైన ప్రాంగణంలో డిపో నిర్మాణం జరుగుతుంది.రైళ్ల నిర్వహణ పనుల విషయంలో జాప్యం లేకుండా ఉండేందుకు 24 గంటలు ఈ డిపో పని చేయనుంది. ఏపీలో వందేభారత్‌ రైళ్ల(Vande Bharat Trains)కు ప్రయాణికుల మంచి ఆదరణ లభిస్తుండడంతో మరిన్ని మార్గాల్లో నడిపేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సమయానికే గమ్యస్థానాలు చేరడం, అనుకూల సమయ వేళలు ఉండడంతో వీటిని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. నిత్యం విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులు వందేభారత్‌ రైళ్లకు మొగ్గు చూపడంతో వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి.

అధికారులు

ఈ రైళ్లకు విజయవాడ, సికింద్రాబాద్‌ మార్గంలో ఎక్కువ డిమాండ్‌ ఉంది. విశాఖ మార్గం తర్వాత స్థానంలో ఉంది. ఇప్పటికే మూడు వందేభారత్‌ రైళ్లు నడుపుతున్నారు. ఇప్పుడు విజయవాడ, బెంగళూరు మార్గంలో మరో కొత్త రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. దీనికి సంబంధించి సమయ వేళలు ఇప్పటికే రైల్వే శాఖ ప్రకటించింది. మరో రెండు నెలల్లో డివిజన్‌కు మరో రైలును కేటాయించనున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.

 Vande Bharat: జెట్​ స్పీడ్​లో వందేభారత్‌ పనులు
Vande Bharat: జెట్​ స్పీడ్​లో వందేభారత్‌ పనులు

ప్రత్యేకం

ఈ రైళ్ల నిర్వహణకు ప్రత్యేకంగా అధికారులు, సిబ్బంది ఇప్పటికే సికింద్రాబాద్, చెన్నైలలో ట్రైనింగ్ తీసుకున్నారు. ప్రస్తుతం కోచింగ్‌ డిపోలో ఈ పనులు జరుగుతున్నాయి. డిపో పూర్తయిన అనంతరం వందేభారత్‌ నిర్వహణ పనులన్నీ అక్కడే జరుగుతాయి. సుమారు 100 మంది వరకు సాంకేతిక సిబ్బందిని ఈ రైళ్ల కోసం ప్రత్యేకంగా కేటాయించనున్నారు. మరమ్మతులకు గురైనప్పుడు కావాల్సిన విడిభాగాలను ఇప్పటికే చెన్నై కోచ్‌ ఫ్యాక్టరీ నుంచి తెప్పించారు. అత్యాధునికంగా నిర్మిస్తున్న ఈ డిపో ఆంధ్రప్రదేశ్​కే తలమానికం కానుందని అధికారులు వెల్లడించారు.భవిష్యత్తులో మరిన్ని వందేభారత్ రైళ్లు విజయవాడ(Vijayawadaమీదుగా నడిచే అవకాశం ఉంది.వాస్తవానికి విజయవాడ మీదుగా ప్రస్తుతం మూడు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్ – విశాఖపట్నం, విజయవాడ – చెన్నై, తిరుపతి – విజయవాడ మధ్య ఈ రైళ్లు తిరుగుతున్నాయి. దేశంలోనే ఇది రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్ కావడంతో ఇక్కడ మెయింటెనెన్స్ స్టేషన్ అవసరం అని భావించారు. అందుకే ఈ డిపోను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు.

Read Also: VishakaPatnam Metro: విశాఖలో అక్టోబర్ నుండి మెట్రో పనులకు శ్రీకారం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870