📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Ration Cards: ఏపీ రేషన్ కార్డులపై కీలక అప్డేట్

Author Icon By Anusha
Updated: May 18, 2025 • 3:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తు ఈ ప్రక్రియ కొనసాగుతోంది. లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో కొత్తగా పెళ్లై రేషన్‌ కార్డు(Ration Card) కోసం దరఖాస్తు చేసుకునేవారు, ఆధార్‌తో పాటు వివాహ ధ్రువపత్రం జతచేసి సచివాలయాల్లో అందజేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది.అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ పొందాలంటే.పెళ్లికార్డు ఉండాలి. అలాగే దరఖాస్తుకు జత చేసేందుకు కూడా పెళ్లి కార్డు కావాలి. దీంతో చాలామంది మళ్లీ శుభలేఖలను ప్రింటింగ్‌ చేయించుకుంటున్నారు.వివాహ ధ్రువీకరణ పత్రం పొందాలంటే, అప్లై చేసే సమయంలో దరఖాస్తు ఫారానికి భార్యాభర్తల ఆధార్‌ కార్డు, వయసు నిర్ధారణ ధ్రువీకరణ పత్రం, శుభలేఖ, వివాహ సమయంలో తీసుకున్న ఫొటోలు, ముగ్గురు సాక్షులు, కల్యాణ మండపం రసీదు వంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలయంలో పెళ్లి చేసుకుంటే దేవాలయం వారు ఇచ్చే రిజిస్ట్రేషన్‌ పత్రం, రూ.500 చలానా జత చేసి సబ్‌రిజిస్ట్రార్‌(Sub-Registrar)కు దరఖాస్తు సమర్పించాలి. వారు వివరాలను పరిశీలించి అన్నీ కరెక్ట్‌గా ఉంటే గంట వ్యవధిలో వివాహ ధ్రువీకరణ పత్రం మంజూరు చేస్తారు.

Ration Cards: ఏపీ రేషన్ కార్డులపై కీలక అప్డేట్

అవకాశం

గ్రామాల్లో, పట్టణాల్లో వివాహం చేసుకునే వారు పెళ్లి అయిన వెంటనే సచివాలయాల్లో మ్యారేజ్ సర్టిఫికేట్(Marriage certificate) కోసం అప్లై చేసుకుంటే మంచింది. అక్కడ వెంటనే మంజూరు చేస్తారు. వివాహం జరిగిన వెంటనే సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే అన్ని వివరాలను పరిశీలించి అక్కడే ధ్రువీకరణ పత్రాలను అందిస్తున్నారు. కానీ గడువు దాటిన వారు మాత్రం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచే పొందాల్సి ఉంటుంది. మ్యారేజ్ సర్టిఫికేట్ పొందాలంటే ఫొటోలు, ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌లు, పురోహితుడి ధ్రువీకరణ, చలానా చెల్లింపు ఇలా మొత్తంగా రూ.1000 వరకు ఖర్చవుతోంది. దీనికి అదనంగా కొందరు రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో దళారుల దందాలకు పాల్పడుతూ ప్రజల వద్ద రూ.3 వేలకు పైగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు వివాహ రిజిస్ట్రేషన్‌ పత్రం నుంచి ప్రభుత్వం మినహాయింపునిచ్చే అవకాశం ఉందని డీఎస్‌వో(DSO)లు చెబుతున్నారు. ఇటీవల పౌరసరఫరాల కమిషనర్‌తో జరిగిన సమావేశంలో ఈ సమస్యను మంత్రి నాదెండ్ల దృష్టికి తీసుకువెళ్లారు. ప్రత్యామ్నాయంగా శుభలేఖ, ఫొటో వంటి ఆధారాలు తీసుకునేలా సడలింపు ఇస్తామని తెలిపారు. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో దరఖాస్తుదారులు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.అయితే ఒక కుటుంబంలో ఉంటూ వేరు కాపురం వెళ్లిన వారు తమ కార్డులను విభజించుకోవాలనుకుంటారు. అలాంటి వారి కోసం అవకాశం కల్పిస్తున్నారు. అయితే వారు మాత్రం మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని అంటున్నారు. అయితే కొత్తగా పెళ్లైన దంపతులు మాత్రం వివాహ ధ్రువీకరణ పత్రం తీసుకోవడం మంచిదని,ఎప్పటికైనా ఉపయోగమే అంటున్నారు.

Read Also: Tirupati: తిరుపతిలో నిర్మాణం కానున్న కొత్త బస్టాండ్

#apgovt #APRationCard #MarriageCertificate #PublicServices #RationCardUpdate Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.