ఆంధ్రప్రదేశ్ లోని కడపలో ఇద్దరు అఫ్ఘానిస్థాన్ దేశస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున రాజీవ్‌పార్కు దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతుండగా బ్లూకోల్ట్స్ సిబ్బంది వారిని గుర్తించారు. వారిని వెంటనే అదుపులోకి తీసుకుని ఆరా తీయగా వారిద్దరు అసదుల్లా, ఓవాస్ అని తేలింది. వెంటనే వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిద్దరూ ఐదేళ్ల క్రితం వీసాతో ఇండియాకు వచ్చారు. ప్రస్తుతం వారి వీసా గడువు ముగిసింది. దీంతో పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు.వీరిద్దరు అఫ్ఘానిస్థాన్ నుంచి వచ్చి మొదట ఢిల్లీలో పనిచేశారు.కొంతకాలం తర్వాత నంద్యాలకు వెళ్లారు. రెండు నెలల క్రితం కడపకు వచ్చారు. వారిలో ఒకరు ఐస్‌క్రీమ్ షాపులో మరొకరు వేరే చోట పని చేస్తున్నారు. వారి వీసాల గడువు ముగిసినా అక్రమంగా ఇక్కడ ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు. అందుకే వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారి దగ్గర ఉన్న గుర్తింపు కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
నిర్ణయం
ఇటీవల భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తలతో పాకిస్థాన్ పౌరులు వెంటనే వారి దేశానికి వెళ్లిపోవాలని సూచించిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌లో ఉన్న పాకిస్థాన్ పౌరులు వెంటనే వారి దేశానికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో పోలీసులు ఇటీవల ఏపీలోని పాకిస్థాన్ పౌరుల సమాచారం సేకరించింది.వారి వీసాలతో పాటుగా ఇతర డాక్యుమెంట్లను పరిశీలించారు.అయితే తాాజాగా కడపలో ఇద్దరు అఫ్ఘానిస్థాన్ పౌరులు దొరికిపోవడం వారికి వీసాలు కూడా లేకపోవడం కలకలం రేపుతోంది. వారిద్దరికి వీసాలు లేకపోవడంతో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి. వారికి వీసాలు ఇచ్చి తిరిగి అఫ్ఘానిస్థాన్‌కు పంపిస్తారా వారిపై కేసు నమోదు చేస్తారా అన్నది చూడాలి. అసలు వీరు అఫ్ఘానిస్థాన్ నుంచి ఎందుకు వచ్చారు.ఢిల్లీ నుంచి కడప ఎందుకు రావాల్సి వచ్చిందో ఆరా తీస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులకు కడప జిల్లా పోలీసులు సమాచారం అందించనున్నారు.
Read Also : Andhra Pradesh: టీచర్ల లీప్ యాప్ వార్త పై నిజంలేదు..ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్