Writer Boggula Srinivas death case: రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసులో ట్విస్ట్

Read Time:  1 min
Writer Boggula Srinivas death case: రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసులో ట్విస్ట్
FONT SIZE
GET APP

Writer Boggula Srinivas death case: తెలంగాణలో కలకలం రేపుతున్న రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 14న ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్లో మునిగిన కారులో శ్రీనివాస్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. శ్రీనివాస్ ఒంటిపై గాయాలు ఉన్నాయని, సహజ మరణం కాదని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారు యజమానితో పాటు, డ్రైవర్‌ను విచారించిన అనంతరం కేసులో పూర్తి వాస్తవాలు బయటికి వస్తాయని పోలీసులు చెబుతున్నారు.

Read Also: AP: ప్రభుత్వం కీలక నిర్ణయం – అసోసియేట్ ప్రొఫెసర్లు, సబ్‌ రిజిస్ట్రార్లకు పదోన్నతులు

Twist in the death case of writer Boggula Srinivas
Twist in the death case of writer Boggula Srinivas

అనుమానాస్ప‌ద స్థితిలో మృతి

బొగ్గుల శ్రీనివాస్‌ 2014లో పవన్ కల్యాణ్(Pawan Kalyan) రాజ‌కీయ ప్ర‌వేశాన్ని విమ‌ర్శిస్తూ ‘పవన్ కల్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో’ అంటూ ఓ వివాదాస్ప‌ద పుస్త‌కాన్ని రాశారు. అప్పట్లో ఈ పుస్తకం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప‌వ‌న్ అభిమానులు, జ‌న‌సేన మ‌ద్ద‌తుదారులు దీన్ని తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఈ క్ర‌మంలో ప‌లు కేసులు న‌మోద‌వ‌గా శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు శ్రీనివాస్ అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెంద‌డం హాట్ టాపిక్ గా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.