📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Andhra Pradesh: ఆలూరు చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్యకేసులో ఊహించని ట్విస్ట్

Author Icon By Anusha
Updated: May 14, 2025 • 1:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్  రాజకీయాల్లో, కర్నూలు జిల్లాలో సంచలనం సృష్టించిన ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇంఛార్జ్, దళిత సంఘాల రాయలసీమ జిల్లా నాయకుడు చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో కీలక పురోగతి లభించింది. ఈ కేసులో టీడీపీ గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు, ఆలూరు మార్కెట్‌యార్డు మాజీ ఛైర్మన్‌ గుమ్మనూరు నారాయణను పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే కాంట్రాక్టు కమీషన్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిస్తానని బెదిరించడంతో లక్ష్మీనారాయణను హత్య చేసినట్లు తెలుస్తోంది. అన్ని విషయాలపై సాంకేతికంగా నిర్ధారించుకున్న తర్వాత స్వగ్రామం చిప్పగిరి మండలం(Chippagiri Mandalam) గుమ్మనూరులో నారాయణను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇంకా కొంతమంది ఉన్నారని, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. నారాయణను కోర్టులో హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించారు.గత నెల 27న చిప్పగిరి-గుంతకల్లు శివారులో చిప్పగిరి లక్ష్మీనారాయణ దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఇప్పటికే రాజేష్, గౌసియా, సౌభాగ్య అనే ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. వారిని కోర్టు అనుమతితో పోలీసు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. ఈ విచారణలో గుమ్మనూరు నారాయణకు ఈ హత్యతో సంబంధం ఉందని తేలింది. రైల్వే కాంట్రాక్టు కమీషన్ల విషయంలో లక్ష్మీనారాయణ బెదిరింపులకు పాల్పడ్డారని ఈ కారణంతోనే లక్ష్మీనారాయణను హత్య చేయించినట్లు చెబుతున్నారు. నారాయణకు పరిచయం ఉన్న గౌసియా, పెద్దన్న, రాజేష్‌తో కలిసి హత్యకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. లక్ష్మీనారాయణకు భూ వివాదాలు, ఇతర విషయాల్లో మనస్పర్థలు ఉండటంతో వారంతా కలిసి ఈ హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో మొదట టిప్పర్ కొనడానికి గుమ్మనూరు నారాయణ రూ.2 లక్షలు ఇచ్చాడని పోలీసులు తెలిపారు. హత్య జరిగిన తరువాత నిందితులు పారిపోయేందుకు, ఇతర అవసరాల కోసం మరో రూ.లక్షన్నర ఇచ్చాడని విచారణలో తేలిందన్నారు.

ఫిర్యాదు

2007లో కర్నూలు జిల్లా కీలక టీడీపీ నేత, కేడీసీసీబీ మాజీ చైర్మన్‌ వైకుంఠం శ్రీరాములు, ఆయన సతీమణి శకుంతలమ్మ దంపతుల జంట హత్య కేసులో హత్యకు గురైన చిప్పగిరి లక్ష్మీనారాయణ ఏడో నిందితుడుగా ఉన్నారు. ఈ కేసును కోర్టు కొట్టివేయగా జంట హత్యలకు ప్రతికారంగానే నారాయణ హత్య చేయించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. లక్ష్మీనా రాయణ(LakshminaRayana) కుమారుడు వినోద్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలువుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత లక్ష్మీనారాయణకు గుంతకల్లులో ఓ భూమి వివాదంలో గౌసియాబేగంతో విభేదాలు ఉన్నాయి. ఈ కోణంలో దర్యాప్తు చేయగా గౌసియా, పెద్దన్న, సౌభాగ్య, రాజేశ్‌లతో పాటు మరో ఆరుగురిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ఇంతలో గుమ్మనూరు నారాయణ పేరు కడా తెరపైకి రావడంతో దర్యాప్తు చేసి నిజమని తేలడంతో అరెస్ట్ చేశారు.

Read Also : Big Shock : మరో వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామా

#AndhraPradeshNews #BreakingNews #JusticeForLakshminarayana #MurderInvestigation Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.