📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Visakhapatnam: విశాఖపట్నం జూకి తరలించిన తాబేళ్లు

Author Icon By Anusha
Updated: May 13, 2025 • 12:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మంలో ఉన్న కూర్మనాథ క్షేత్రంలో నక్షత్ర తాబేళ్లు చనిపోవడం కలకలం రేపింది. ఆలయ సిబ్బంది ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురాకుండానే రహస్యంగా తాబేళ్లను దహనం చేశారనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీకూర్మం నుంచి వంద తాబేళ్లను విశాఖపట్నంలోని జూకి(Visakhapatnam Zoo )తరలించారు.ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నవాటిని అక్కడికి పంపారు. ఆలయంలో తాబేళ్ల సంరక్షణకు తగిన స్థలం లేకపోవడంతో తరచూ అనారోగ్యానికి గురవుతున్నాయని చెబుతున్నారు.ఇటీవల శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌, అటవీ శాఖ, పశువైద్య శాఖ అధికారులు తాబేళ్లను పరిశీలించారు. ఈ నెల 4న పార్కులో ఆరోగ్యంగా లేని వంద తాబేళ్లను గుర్తించారు.వాటికి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం జూలోని యానిమల్‌ రెస్క్యూ సెంటర్‌(Animal Rescue Center)కు తరలించారు. అక్కడ వాటికి వైద్య సేవలు అందిస్తున్నారు. చాలా తాబేళ్లకు నోటి నుంచి నురగ వస్తుండటంతో అవి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పార్కులో ఉన్న 211 తాబేళ్లను ఆలయ అధికారులు రోజూ పర్యవేక్షిస్తున్నారు. వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు.

విశాఖపట్నం జూకి తరలించిన తాబేళ్లు

సంరక్షణ

ఆరోగ్యం బాగోలేని వంద తాబేళ్లను విశాఖపట్నంలోని జూ పార్కుకు తరలించామని పశువైద్య శాఖ అధికారులు తెలిపారు. అక్కడ యానిమల్‌ రెస్క్యూ సెంటర్‌లో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. శ్రీకూర్మంలో తాబేళ్ల సంరక్షణకు విశాలమైన స్థలం అవసరమని దీని కోసం ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. అటవీ శాఖ, పశువైద్య శాఖ అధికారులు పరిశీలించి వంద తాబేళ్లను జూ పార్కుకు తరలించామని ప్రస్తుతం ఇక్కడ ఉన్న 212 తాబేళ్లను సంరక్షిస్తున్నామని జిల్లా అటవీశాఖ అధికారి తెలిపారు.శ్రీకూర్మంలో పదేళ్ల క్రితం తాబేళ్ల పార్కును ఏర్పాటు చేశారు.అప్పట్లో తక్కువ సంఖ్యలో తాబేళ్లు ఉండటంతో చిన్న పార్కు సరిపోయింది. కానీ ఇప్పుడు తాబేళ్ల సంఖ్య పెరగడంతో స్థలం సరిపోవడం లేదు. విశాలమైన స్థలం లేకపోవడంతో తాబేళ్లు తరచూ అనారోగ్యానికి గురవుతున్నాయి. పెద్ద స్థలంలో తాబేళ్ల పార్కు(Turtle Park)ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఈ దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Read Also: Anantapuram: అనంతపురం మాజీ ఎంపీ ఇకలేరు

#AnimalWelfare #StarTortoises #TortoiseRescue #TortoiseCare #WildlifeConservation Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.