📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

TTD: తిరుమల అభిషేకం దర్శనాల పేరుతో దళారీ మోసం

Author Icon By Ramya
Updated: July 4, 2025 • 10:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tirumala: ఏడుకొండల వేంకటేశ్వరస్వామిని దగ్గరగా తమ కళ్ళారా వీక్షించుకోవాలనే తపన ప్రతి భక్తునికి కలుగుతుంది. అలాంటి భక్తుల అమాయ కత్వాన్ని, దర్శనాలను ఆసరాగా చేసుకుంటున్న కొందరు దళారులు సులభంగా తమ వలలోవేసుకుని వేలల్లో, లక్షల్లో డబ్బులు తీసుకుని చివరకు చేతులెత్తేస్తుండటం కొందరైతే, మరికొందరు ఏకంగా నకిలీ దర్శన టిక్కెట్లు (Fake Darshan tickets) సృష్టించి భక్తులను మోసం చేస్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన ఓ దళారీ తెలంగాణ సిరిసిల్ల వాసులను భారీగా మోసం చేశాడు. ఆ భక్తులు తమకు తోమాలసేవ దర్శనం అదృష్టమని భావించి తిరుమలకు చేరుకుంటే అసలు మోసం జరిగిందని తెలుసుకున్నారు. తిరుమల పోలీసుల కథనం మేరకు సిరిసిల్లకు చెందిన విజయ్ కుటుంబంతో శ్రీవారి తోమాల (Srivari Thomala), అబిషేక సేవలు దర్శనం కావాలని కోరాడు. ఇందుకు అతనికి తెలిసిన వ్యక్తి ద్వారా బాలాజీ అనే వ్యక్తి నంబర్ను తీసుకుని కోరిన దర్శనం చేయిస్తాడని నమ్మించాడు. బాలాజీని ఫోన్లోనే సంప్రదించడంతో కోరిన దర్శన టిక్కెట్లు ఇప్పిస్తానని అందుకు 65వేల రూపాయలు నగదును రెండు దశల్లో తీసుకున్నాడు. గత వారం క్రిందట విజయ్ తన కుటుంబంలోని ఐదుగురు సభ్యుల పేర్లతో టిటిడి (TTD) లోగోతో ఉన్న నకిలీ తోమాలసేవ టిక్కెట్ను జైలూ 3వ తేదీ గురువారం (నేడు) దర్శనానికి, మరుసటిరోజు 4వ తేదీ శుక్రవారం రోజుకు 6 మంది భక్తులకు అభిషేకం సేవ టిక్కెట్ను ఇప్పించాడు. భక్తులకు అనుమానం రాకుండా ఈ టిక్కెట్లను ఓ ఇంటర్నెట్ దుకాణం నుండి డౌన్లోడ్ చేయించి విజయ్ మొబైల్ కు పంపించాడు. ఇది నిజమేనని నమ్మిన విజయ్ కుటుంబం సంతోషంగా తిరుమలకు బయలుదేరారు.

నకిలీ టిక్కెట్లు.. తిరుమల సేవలకు మోసపోయిన భక్తులు

TTD: అయితే ఇవి నకిలీ దర్శన టిక్కెట్లు అని తేలియకపోవడంతో తిరుపతిలో ముందస్తుగా టైమ్ స్లాట్ టోకెన్లు కూడా పొందారు. ఈ నకిలీ దర్శన టిక్కెట్లతో తిరు మలకు వచ్చిన భక్తులు గురువారం వేకువ జామున తోమాలసేవకు హాజరవడానికి రావ డంతో నకిలీవిగా తేలింది. వసతి కోసం సూట్ రూమ్ బుక్ చేశాడని చెప్పిన బాలాజీ చివరకు ఫోన్ తీయకపోగా స్పందించలేదు. దీంతో భక్తులు మోసపోయామని గ్రహించి తిరుమల 1టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమల పోలీసులు తదుపరి జరిగిన సంఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అయితే సాధారణంగా కలియుగప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి మంగళ, బుధ, గురువారాల్లోనే తోమాల, అర్చన సేవలు గృహస్థ భక్తుల మధ్య జరిపిస్తారు. మిగిలిన మూడు రోజులు ఏకాంతంగా జరిపిస్తారు. అయితే రాజ్యాంగ పరిధిలోని విఐపిల సిఫార్సు లేఖలపై పరిమితంగా ఒకటిలేదారెండు తోమాల సేవా టిక్కెట్లు, ఒకటి అభిషేకం సేవ టిక్కెట్ మంజూరవుతాయి. అలాంటిది ఏకంగా దళారీ బాలాజీ ఎక్కువమంది భక్తులకు తోమాల, అభిషేకం సేవ టిక్కెట్లు నకిలీవి సృష్టించి పంపడంతో ఇప్పుడు దళారీ దందా మరోసారి టిటిడి విజిలెన్ శాఖ అధికారులను సైతం ఆశ్చర్యపరిచింది.

Read Hindi Also: hindi.vaartha.com

Read Also: Liquor Dump Case : కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మరో షాక్‌

#AbhishekamSeva #BalajiDarshanScam #DarshanFraud #FakeTickets #PilgrimFraud #TempleScam #ThomalaSeva #Tirumala #Tirupati #ttd #ttdscam #TTDVigilance Abhishekam Seva Ap News in Telugu Balaji fake tickets Breaking News in Telugu darshan token fraud fake darshan tickets Google News in Telugu Latest News in Telugu online ticket scam Paper Telugu News pilgrim cheating Sirisilla fraud Telangana devotees Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today temple fraud Thomala Seva tirumala Tirupati scam Today news TTD TTD vigilance VIP recommendation misuse

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.