📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Trans Women: ట్రాన్స్ ఉమన్ కూ పూర్తి హక్కులు.. హైకోర్టు

Author Icon By Ramya
Updated: June 23, 2025 • 10:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Vijayawada: పురుషుడి నుంచి మహిళగా మారిన ఓ ట్రాన్స్ ఉమన్ (Trans Women)కూ సంతానోత్పత్తి సామర్థ్యం లేకున్నా స్త్రీకి ఉండే అన్ని హక్కులుంటాయని అత్యున్నత న్యాయ స్థానం స్పష్టం చేసింది. ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదనే కారణంతో తనను మహిళగా పరిగణించడానికి వీల్లేదన్న వాదనను హైకోర్టు తిరస్కరించింది. ఇలాంటి వాదని తప్పని, చట్టపరంగా ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది. ఎపి హైకోర్టు న్యాయవాదులు తెలిపిన సమాచారాన్నిఅనుసరించి ట్రాన్స్ జెండర్స్ న్యాయ స్థానం పలు అంశాల్లో స్పష్టతను ఇచ్చింది. స్త్రీతత్వాన్ని సంతానోత్పత్తికి పరిమితం చేసే సంకుచిత భావన రాజ్యాంగ స్ఫూర్తిని తక్కువ చేసి చూడటమనేది. లింగ బేధంతో సంబందం లేకుండా పౌరులకు హుందాతనంగా తగిన గుర్తింపుతో, సమానత్వంతో జీవించే హక్కును రాజ్యాంగం కల్పించిందని గుర్తుచేసింది.

ట్రాన్స్ ఉమన్‌కు 498(ఏ) కింద కేసు పెట్టే హక్కు ఉందన్న న్యాయస్థానం

ట్రాన్స్ జెండర్లకు లింగ గుర్తింపును స్వయంగా నిర్ణయించుకునే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని తెలిపింది. పిల్లల్ని కనే సామర్థ్యం లేదన్న కారణంతో ట్రాన్స్ ఉమన్ (Trans Women) స్త్రీ హోదా నిరాకరించడం 498 (ఏ) కింద కేసు పెట్టే హక్కు లేదనడం ఆమె పట్ల వివక్ష చూపడేమనంది. 498 (ఏ) కింద ట్రాన్స్ ఉమను ఆమె భర్త అత్తమామలు, బంధువులపై పోలీసులకు ఫిర్యాదు చేసే హక్కు ఉంటుందని పేర్కొంది. అయితే ప్రస్తుత కేసులో ట్రాన్స్ ఉమను ఆమె భర్త అత్తమామలు వేధించినట్లు కట్నం కోసం డిమాండ్ చేసినట్లు ఆధారాలు లేనందున ట్రాన్స్ ఉమన్ ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులు కొట్టేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఇటీవల కీలక మార్పు ఇచ్చారు.

షబానా–కృష్ణమూర్తి ప్రేమ వివాహం

ఒంగోలుకు చెందిన షబానా ట్రాన్స్ ఉమన్ చెన్నైకి చెందిన విశ్వనాథన్ కృష్ణమూర్తి షబానా ప్రేమించుకున్నారు. హైదరాబాద్ ఆర్య సమాజ్లో 2019 జనవరి 21న వివాహం చేసుకున్నారు. అదే ఏడాది మార్చి 11 వరకు ఒంగోలులో నివాసం ఉన్నారు. ఆ తర్వాత కృష్ణమూర్తి చెన్నైలోని తల్లిదండ్రులు దగ్గరికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో షబానా చెన్నైలోని కృష్ణమూర్తి ఇంటికెళ్లి ఆరా తీశారు. అక్కడ భర్త అత్తమామలు తనను చంపేస్తామని బెదిరించారని ఒంగోలు మహిళ పోలీసు స్టేషన్లో షబానా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి ఒంగోలు కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ కృష్ణమూర్తి, అతని తల్లిదండ్రులు 2022 లో హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరపు న్యాయవాది తాండవ యోగేష్ వాదనలు వినిపిస్తూ ట్రాన్స్ జెండర్కు సంతానోత్పత్తి సామర్థ్యం ఉండదని, ట్రాన్స్ఉమన్ను మహిళగా పరిగణించడానికి వీల్లేదని, ఈ నేపథ్యంలో షబానాకు భర్త అత్తమామలపై 498(ఏ) కింద కేసు పెట్టే అర్హత లేదన్నారు. వేధింపులకు గురిచేశారనేందుకు ఆధారాలు కూడా లేదన్నారు.

ట్రాన్స్ జెండర్ల హక్కులకు సుప్రీంకోర్టు మద్దతు

పోలీసులు తరపున ఏపీపీ ప్రియాంక లక్ష్మీ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి పుట్టుక సమయంలో ఉన్న లింగ నిర్ధారణే, ఆ వ్యక్తి లింగ గుర్తింపుగా ఉండాల్సిన అవసరం లేదన్నారు. ట్రాన్స్ జెండర్ల హక్కులను రక్షించేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను గుర్తుచేశారు. లింగ గుర్తింపు కోసం ట్రాన్స్ జెండర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారని పుట్టినప్పుడు పేర్కొన్న లింగాన్నే తప్పనిసరిగా అనుసించాల్సిన అవసరం లేకుండా ఆదేశాలివ్వాలని కోరారన్నారు. సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించి రాజ్యాంగం కల్పించిన హక్కులు కేవలం పురుషులు, స్త్రీలకే పరిమితం కాదని, ట్రాన్స్ జెండర్లకు వర్తిస్తాయని తెలిపిందన్నారు. ఈ తీర్పునకు అనుగుణంగా 2019లో ట్రాన్స్ జెండర్ పర్సన్స్ చట్టాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని వివాహం తర్వాత భిన్న లింగసంపర్క సంబంధం ఉన్న ట్రాన్స్ ఉమన్/ట్రాన్స్ జెండర్కు 498(ఏ) కింద కేసు పెట్టే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు.

Read also: Deputy Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌పై మార్ఫింగ్‌ పోస్టుల కలకలం – జనసేన నేతల ఫిర్యాదు

#498A #APHighCourt #ConstitutionalRights #EndDiscrimination #EqualityForAll #GenderEquality #GenderRecognition #HumanRights #InclusiveJustice #IndianJudiciary #JusticeForShabana #LegalRights #LGBTQRights #MarriageEquality #StopTransphobia #TransgenderLaw #TransJustice #TransLivesMatter #TransRights #TransWomenAreWomen Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.