📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

రామ్‌చరణ్ సతీమణి ఉపాసన గొప్ప నిర్ణయం

Author Icon By Ramya
Updated: February 6, 2025 • 2:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు టాలీవుడ్ హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన. తన తాత పుట్టిన రోజు సందర్భంగా పెద్ద మనసుతో కీలక ప్రకటన చేశారు. రామ్‌చరణ్ బాబాయి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రకటించారు. అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలి హోదాలో.. ఉపాసన తన తాత, అపోలో హాస్పిటల్స్‌ అధినేత ప్రతాప్‌ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళా శిశు సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తాత ప్రతాప్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ట్వీట్ చేశారు.

అపోలో ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖలను సమూలంగా మార్చి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చారు.ఈ సమాజం కోసం ఒక గొప్ప అడుగు ముందుకు వేస్తున్నామన్నారు.. రాష్ట్రంలోని 109 అంగన్‌వాడీ కేంద్రాల్లో వసతులు కల్పిస్తామని ప్రకటించారు. ముందుగా పిఠాపురంలో ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తామని.. రాష్ట్రవ్యాప్తంగా పిల్లలు, మహిళలకు మెరుగైన వైద్య సేవలు, పౌష్టికాహారం అందించడమే తమ ఫౌండేషన్ లక్ష్యం అన్నారు. ఈ గొప్ప కార్యక్రమానికి సంబంధించి త్వరలోనే ఐసీడీఎస్‌ అధికారులతో సమావేశం నిర్వహించి విధానాలను రూపొందిస్తామని చెప్పారు. ఏపీలో చేపట్టబోయే ఈ కార్యక్రమానికిఅపోలో హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలకు చెందిన సీఎస్‌ఆర్‌ నిధులు కేటాయిస్తామన్నారు.’గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అనంతరం మహిళలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం.. ప్రసూతి, శిశు మరణాలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం. మహిళా సాధికారతపై అవగాహన కల్పిస్తాం. ఇది ప్రారంభం మాత్రమే.. త్వరలోనే 109 అంగన్‌వాడీ భవనాలు పునరుద్ధరిస్తాం’ అంటూ ట్వీట్ చేశారు.

Ap News in Telugu Breaking News in Telugu foundation Google news Google News in Telugu Latest News in Telugu medical services nutritious food Paper Telugu News prathap reddy ram charan Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Upasana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.