📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Tirupati: తిరుపతిలో క్రిస్ సిటీ ఏర్పాటు..

Author Icon By Anusha
Updated: July 7, 2025 • 12:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామికీకరణకు కొత్త దిశను సూచించేలా మరో భారీ అడుగు వేసింది. ఇప్పటికే ఉన్న పారిశ్రామిక వృద్ధిని మరింత వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకొని, తిరుపతి జిల్లాలో కృష్ణపట్నం పారిశ్రామిక నగరం (KRIS City) అనే మెగా ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఇది కేవలం ఓ పారిశ్రామిక ప్రాజెక్టు మాత్రమే కాకుండా, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే కేంద్రమైన నగరంగా మారనుంది.ఈ క్రిస్‌ సిటీ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.37,500 కోట్ల పెట్టుబడితో ముందుకు సాగనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయిన తరువాత దాదాపు 4,67,500 మందికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇది ఏపీ పరిశ్రమల రంగంలోనే కాదు, సమగ్ర అభివృద్ధిలోనూ కీలకమైన మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.ఈ క్రిస్ సిటీ చెన్నై, కృష్ణపట్నం పోర్టులు, రేణిగుంట విమానాశ్రయం, చెన్నై- కోల్‌కతా నేషనల్ హైవేుకు దగ్గరలో ఉంది.

మొదటి దశలో

ఈ క్రిస్‌ సిటీలో ఏడాదిన్నరలో పనులు పూర్తి చేసి పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుట్టాలని ప్లాన్ చేస్తోంది. ఈ పనుల్ని మరింత ముమ్మరం చేయనుంది.2017లోనే రాష్ట్ర ప్రభుత్వం క్రిస్‌ సిటీ ఏర్పాటుకు నిక్‌డిక్ట్‌ (నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ అండ్‌ ఇంప్లిమెంటేషన్‌ ట్రస్ట్‌)తో ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టు చెన్నై- బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌ (Industrial Corridor) లో భాగంగా ఉంది. ఈ ప్రాజెక్టు కోసం మూడు దశల్లో 10,834 ఎకరాల భూమి అవసరమని అంచనా వేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం మొదటి దశలో కోటతో పాటుగా చిల్లకూరు మండలాల్లో భూమి (2,500.49 ఎకరాలు) సేకరించాలి. అయితే ఇందులో ప్రభుత్వ భూమి ఉంది.దీనిని రైతులు సాగు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది.

Tirupati: తిరుపతిలో క్రిస్ సిటీ ఏర్పాటు..

విషయాన్ని గమనించిన

ఈ ప్రాజెక్టు కోసం భూములు ఇస్తే తాము జీవనోపాధి కోల్పోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం గతంలో ఎకరాకు రూ.5.99 లక్షల పరిహారం ఇవ్వాలని భావించి, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.8 లక్షలకు పెంచారు. రైతులకు సంబంధించి మొత్తం రూ.78.84 కోట్ల పరిహారం ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 371 ఎకరాలకు రూ.40 కోట్లు అకౌంట్‌లలో జమ చేశారు. అయితే ప్రధాని మోదీ (Prime Minister Modi),క్రిస్‌ సిటీకి శంకుస్థాపన చేశారు.ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి రూ.2,139.43 కోట్లతో మౌలిక వసతులు కల్పించాలని ప్లాన్ చేయగా.. నిక్‌డిక్ట్‌ ఇప్పటివరకు రూ.531.36 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుతం రోడ్లతో పాటుగా విద్యుత్, బ్రిడ్జిలు, నీటి సరఫరా వంటి పనులు చేస్తున్నారు. ఈ పనుల్ని 2027 ఫిబ్రవరి 13 నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. 

ప్రత్యేకమైన గుర్తింపు

ఈ ప్రాజక్టుకు సంబంధించి భూసేకరణ పూర్తయిన వెంటనే అన్ని వసతులు కల్పిస్తున్నామంటున్నారు అధికారులు. పనులు మరింత వేగంగా జరిగేలా చూస్తామని.. ఈ సిటీలో ఫుడ్, వస్త్రాలు, ఇంజినీరింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు వస్తాయని భావిస్తున్నారు. క్రిస్‌ సిటీ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు (unique identity) ను తీసుకొస్తుంది అంటున్నారు. మొత్తం మీద క్రిస్ సిటీకి సంబంధించిన పనుల్ని మరింత వేగవంతం చేశారు.పుణ్యక్షేత్రమైన తిరుపతికి ఇది మరో పరంగా గుర్తింపు తీసుకొచ్చే అవకాశం ఉంది. భక్తుల నగరంగా మాత్రమే కాకుండా, పారిశ్రామిక శక్తిగా మారే దిశగా ఇది తొలి అడుగు కానుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Pawan: ఆన్‌లైన్ బెట్టింగ్‌ కి బలైన ఇంజనీర్

#AndhraPradesh #APGovernment #APProgress #ChennaiKolkataHighway #EconomicBoost #EmploymentGeneration #IndustrialCity #IndustrialDevelopment #IndustrialGrowth #InfrastructureDevelopment #InvestInAP #KrisCity #Krishnapatnam #KrishnapatnamPort #MakeInIndia #ManufacturingHub #MegaProject #ReniguntaAirport #SouthIndiaDevelopment #TirupatiDistrict Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.