Tirumala Srivari Teppotsavam Day2: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక తెప్పోత్సవాలు రెండో రోజు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామివారు పుష్కరిణిలోని తెప్పపై భక్తులకు దర్శనమిచ్చారు.
Read Also: CM Chandrababu Visit Cheepurupalli: రేపు చీపురుపల్లికి సీఎం చంద్రబాబు
పుష్కరిణిలో మూడు చుట్లు..
ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించి, సాయంత్రానికి శ్రీవారి పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు విద్యుద్దీపాలతో, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆశీనులయ్యారు. వేదం, గానం, నాదం మధ్య స్వామివారు పుష్కరిణిలో మూడుసార్లు విహరిస్తూ భక్తులను కటాక్షించారు.

Tirumala Srivari Teppotsavam Day2: రేపు మలయప్పస్వామి విహారం
ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన శనివారం శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొలుత తిరుచ్చిపై సర్వాలంకార భూషితుడై పురవీధుల్లో ఊరేగిన అనంతరం, కోనేటిలోని తెప్పపై ఆశీనుడై మూడుసార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, జేఈవో డాక్టర్ ఏ.శరత్, సీవీఎస్వో మురళీకృష్ణ మరియు పలువురు బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:’