Tirumala: తులాభారంలోనూ కాకిలెక్కలే!

Read Time:  1 min
Even in the weighing ceremony, there are fraudulent calculations!
Even in the weighing ceremony, there are fraudulent calculations!
FONT SIZE
GET APP

బోర్డు సభ్యుడే ఫిర్యాదు చేసినా పట్టించుకోని పెద్దలు

తిరుమల: ఏడుకొండల వేంకటేశ్వరస్వామికి భక్తులు మొక్కుల్లో భాగంగా చెల్లించే తులాభారం లెక్కల్లో భారీ తేడాలు ఉన్నాయని వచ్చిన ఆరోపణలు ఇప్పటికీ తేలలేదు. వంద కోట్ల రూపాయలకు పైగా స్కామ్ జరిగిందని టిటిడి బోర్డు సభ్యుడు జి. భానుప్రకాశ్ రెడ్డి స్వయంగా టిటిడి విజిలెన్స్, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలకు ఫిర్యాదు చేయడం సంచలనం కలిగించింది. ఈ ఘటనపై గత పది నెలలుగా ఎలాంటి స్పష్టత రాకపోవడం భక్తుల్లో అనుమానాలను పెంచుతోంది. దేవుని ఖజానాకు చేరాల్సిన సొమ్ము గల్లంతయిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన హిందూ భక్తులు కోరికలు నెరవేరిన వెంటనే తులాభారం మొక్కులు చెల్లిస్తుంటారు. చిన్నపిల్లల నుంచి ప్రముఖుల వరకూ ఈ మొక్కు ఎంతో ప్రీతిపాత్రంగా భావిస్తారు. అయితే ఇంత పవిత్రమైన కానుకల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

Read also: SSC Board: టెన్త్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు

Even in the weighing ceremony, there are fraudulent calculations!

Even in the weighing ceremony, there are fraudulent calculations!

తులాభారం త్రాసులో ఒక వైపు భక్తుడు, మరో వైపు నాణేలు, బెల్లం, చక్కెర, బియ్యం, డ్రైఫ్రూట్స్ లేదా నగదు ఉంచి తూకం వేస్తారు. భక్తుడు ఎంత బరువుంటే అంత మొత్తాన్ని నగదు రూపంలో టిటిడికి సమర్పిస్తారు. ఈ విధంగా రోజుకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆదాయం వస్తుందని టిటిడి వర్గాల సమాచారం. అయితే 2019 నుంచి 2024 మధ్యకాలంలో వచ్చిన ఆదాయంలో సగం మొత్తము దేవుని ఖజానాకు చేరలేదన్నది ప్రధాన ఆరోపణ. గత ఏడాది మే నెలలో ఈ అంశం బయటకు రావడంతో సంచలనం ఏర్పడింది. తులాభారం కానుకలు స్వాహా అయ్యాయంటూ భానుప్రకాశ్ రెడ్డి ఆధారాలతో ఫిర్యాదు చేయడం ఆరోపణలకు బలం చేకూర్చింది. అయినా ఇప్పటివరకు బాధ్యులెవరన్నది తేలకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.

ప్రతిరోజూ తిరుమలకు (Tirumala) లక్షమంది వరకు భక్తులు వస్తుండగా, హుండీ ద్వారా రూ.3–4 కోట్ల ఆదాయం వస్తోంది. తులాభారం ద్వారా రోజుకు సుమారు రూ.10 లక్షల ఆదాయం సమకూరుతుందని అంచనా. గతంలో తులాభారం వద్ద బ్యాంకు కాంట్రాక్టు సిబ్బంది విధులు నిర్వహించేవారని, వారిని తొలగించి టిటిడి ఉద్యోగులను నియమించారని ఆరోపణలు ఉన్నాయి. త్రాసులోనూ అవకతవకలు జరిగాయని ప్రచారం జరుగుతోంది. ఈ భారీ మొత్తాలు ఎవరికి చేరాయన్నదే ఇప్పుడు తేలాల్సిన అసలు ప్రశ్న. దేవుని సొమ్ముతో జరిగిన అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేయాలన్న డిమాండ్ భక్తుల్లో పెరుగుతోంది. త్వరలో నిజాలు వెలుగులోకి రావాలని భక్తులు ఆకాంక్షిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.