हिन्दी | Epaper
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

News telugu: Tirumala: ప్రతి భక్తుడు సురక్షితంగా, సౌకర్యంగా దర్శనం చేసుకోవాలి

Sharanya
News telugu: Tirumala: ప్రతి భక్తుడు సురక్షితంగా, సౌకర్యంగా దర్శనం చేసుకోవాలి

తిరుమల: తిరుమలకొండపై తొమ్మిదిరోజులుపాటుజరిగే శ్రీవేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తామని, పోలీసుశాఖ తరపున సాంకేతికతతో భక్తుల భద్రత పర్యవేక్షణ ఉంటుందని తిరుపతి జిల్లా ఎస్పీ లంకెల సుబ్బరాయుడు (Lankala Subbarayudu)తెలిపారు. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు సురక్షితంగా, సౌకర్యవంతంగా మూలవిరాట్టుతోబాటు వాహనసేవల దర్శనం చేసుకునే విధంగా చూస్తామని తెలిపారు. 4వేల సిసికెమెరాలు, 6 వేలమంది పోలీసులు, విజిలెన్స్ సిబ్బందితో విశాలమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు.

News telugu
News telugu

తిరుమల, తిరుపతిలో భారీ బందోబస్తు

బ్రహ్మోత్సవాల భద్రత, పోలీసుశాఖ పరంగా తీసుకున్న చర్యలు గురించి గురువారం మధ్యాహ్నం తిరుమలలో టిటిడి అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి, సివిఎస్ఒ కెవి మురళీకృష్ణతో కలసి మీడియాతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల(Brahmotsavalam)కు మొత్తం 5,691మంది పోలీసు అధికారులు, సిబ్బందిని నియమిస్తున్నామని, ఇందులో తిరుమలలోనే 4,223 మంది పోలీసులు, తిరుపతిలో 1,468 మంది బందోబస్తు విధుల్లో ఉంటారన్నారు. సివిలోపోలీస్, ఏపిఎస్పి, ఎఆర్, ఎస్బి స్పాటర్స్, ఆక్టోపస్, విజిలెన్స్ సిబ్బంది ప్రత్యేక బృందాలు నాలుగుమాఢవీధుల్లో, క్యూకాంప్లెక్స్ లు, ఘాట్రోడ్డు, పార్కింగ్ ప్రాంతాల వంటి కీలక ప్రాంతాల్లో విస్తృతంగా నియమించడం జరుగుతుందన్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు బారీకేడ్లు ఏర్పాటు, డ్రోన్తో పర్యవేక్షణ, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సీనియర్ పోలీస్ అధికారులతో పర్యవేక్షణ ఉంటుందన్నారు.

క్షేత్రస్థాయిలో పోలీసు సిబ్బందికి ఒంటిపై ధరించే కెమెరాలు, ఆధునిక సమాచార వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం, భక్తులకు కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే వాహనాలనే నిలుపుదలచేయడం వంటివి పోలీసులు చేపడతారన్నారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులు పూర్తిగా గ్యాలరీల్లోకి ప్రవేశ నిష్క్రమణ మార్గాలను వినియోగించాలని ఎస్పీ సుబ్బరాయుడు కోరారు. బ్రహ్మోత్సవాల్లో 24వతేదీ సిఎం చంద్రబాబునాయుడు విచ్చేస్తుండటంతో భద్రత మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. గరుడసేవరోజు తిరుమల ఘాట్లో ద్విచక్రవాహనాలను నిషేధం ఉంటుందన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/mp-mithun-reddy-police-custody/andhra-pradesh/550288/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870