📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Tirumala: ‘కల్తీ నెయ్యి’లో బోలేబాబా డెయిరీ కీలకం

Author Icon By Ramya
Updated: June 23, 2025 • 10:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tirumala: తిరుమల లడ్డుప్రసాదం తయారీలో ప్రధానమైన నెయ్యి కల్తీచేసి టిటిడికి పంపారనే కేసులో క్లైమాక్స్ లో ఉత్తరా ఖండ్ బోలేబాబాడెయిరీ యాజమాన్యం కీలకమని సిబిఐ సిట్ అధికారులు నిర్ధారించారు. 2022లోనే నెయ్యిసరఫరా టెండర్లలో పాల్గోన్న ఈ డెయిరీని టిటిడి బ్లాక్ లో పెట్టింది. అయితే ఆ తరువాత మాల్గంగ డెయిరీని బోలే బాబా తెరపైకి తీసుకువచ్చిందని, ఈ డెయిరీకి కమీషన్లు ఇచ్చి సుగంధ ఆయిల్స్, పామోలిన్ తోబాటు మరికొన్ని రసాయనాలు కలిపి తయారుచేసిన కల్తీనెయ్యిని పరోక్షంగా బోలేబాబా డెయిరీనే (Bolebaba Dairy)టిటిడికి (TTD) పంపిందని సిట్ తేల్చేసింది. టిటిడి తిరుమల (Tirumala) ఆలయంతోపాటు రాష్ట్రంలోని మరికొన్ని ఆలయాలకు ఇదే నెయ్యి సరఫరా చేసినట్లు కూడా సిట్ దర్యాప్తులో ఆధారాలు సేకరించింది.

మేనేజర్ చౌహాన్ కోసం సిట్ వేట

దీనివెనుక ఉన్న పెద్దల పాత్ర కంటే ఆ డెయిరీకి చెందిన మేనేజర్ చౌహాన్ (Manager Chauhan) ను పట్టుకుంటే తప్ప మరింత పూర్తి సమాచారం వెలుగులోకి వస్తుందని సిట్ వెల్లడించింది. చౌహాన్ ను అరెస్ట్ చేస్తే కల్తీనెయ్యివెనుక పెద్దలెవరనేది స్పష్టం కానుంది. ఇప్పటికే కల్తీనెయ్యి సరఫరా కేసులో సుదీర్ఘ విచారణ చేపట్టిన సిట్ అధికారులు పాత్రధారులెవరనేది దాదాపుగా తేల్చేసింది. వారందరినీ అరెస్టుచేసి రిమాండ్కు తరలించింది. ఏఆర్ డైరీ ఎండి రాజశేఖరన్, రూర్కే బోలేబాబాడైరీకి చెందిన అప్పటి డైరెక్టర్లు విపినైజైన్, షోమిలైజైన్, వైష్ణవీడైరీ (పెనుబాక) సిఇఒ అపూర్వ వినయ్కంత్ చావ్దాలు కీలకంగా ఉన్నారు. కోల్కత్తాలో నూనెల పరిశ్రమ నడుపుకుంటున్న పారిశ్రామికవేత్త జ్యోతిష్యను సిట్ విచారణ చేసి కొన్ని ఆదారాలు సేకరించింది. టిటిడి మాజీ చైర్మన్ అప్పన్నను కూడా సిట్ బృందం అదుపులోకి తీసుకుని అవసరమైన సమాచారం మొత్తం సేకరించిన విషయం తెలుస్తోంది.

ఎనిమిది నెలల సిట్ దర్యాప్తు – 15 మంది అరెస్టు

తిరుపతి అలిపిరిలోని తాత్కాలిక సిట్ కార్యాలయం వేదికగా గత ఎనిమిది నెలల దర్యాప్తులో 15మంది వరకు ముఖ్యులైన మేనేజర్ల నుండి అధికారులు, ల్యాబ్ సిబ్బంది, ట్యాంకర్ల డ్రైవర్లు, అధికారులు, సిబ్బంది అయిన నిందితులను అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో బోలేబాబాడెయిరీ జిఎం హరివమోన్రాణా మాస్టర్మైండ్ ఉందని, అతను బయటకు వెళ్తే సాక్ష్యాధారాలు మాయం చేస్తాడని, సాక్షులను ప్రభావితంచేసే అవకాశం ఉందనేది ఎపిపి వాదనలు వినిపించారు. దీంతో ఎసిబి కోర్టులో దాఖలుచేసిన బెయిల్ పిటిషన్ను న్యాయమూర్తి తిరస్కరించారు. కల్తీ నెయ్యిలో అంతా బోలేబాబా డెయిరీ లీలలేనని ఓనిర్ధారణకు వచ్చేసిన సిట్ బృందం పెద్దలెవరనేది తేల్చేపనిలో ఉన్నారు.

కల్తీనెయ్యి కుంభకోణం: తిరుమలలో మొదలై రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన మోసం

2024 జులైలో వెలుగుచూసిన తిరుమల లడ్డూలకు కల్తీనెయ్యి సరఫరా బాగోతంలో ఇప్పటికే సంచలన విషయాలు వెలుగుచూశాయి. దీనిపై తొలుత రాష్ట్రసిట్ ఏర్పాటైనా, కొందరు పెద్దలు రాద్ధాంతం చేసి కేసును ఆపేందుకు ప్రయత్నాలు సాగించారు. దీంతో ఏకంగా సుప్రీంకోర్టు సిబిఐ, రాష్ట్రపోలీసు ఉన్నతాధికారులతో ఒక సిట్ను గత ఏడాది నవంబర్లో ఏర్పాటుచేసింది. ఆ దర్యాప్తు లోని సిబిఐ అధికారులు చేపట్టిన లోతైన సమగ్ర దర్యాప్తులో కల్తీనెయ్యి టిటిడికే పరిమితం కాలేదని, రాష్ట్రంలోని అన్ని ప్రధానమైన ఆలయాలు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమల ఆలయాలకు ఇదే కల్తీనెయ్యి సరఫరా అయ్యిందనేది విస్మయానికి గురిచేసింది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సిబిఐ సిట్ అధికారులకు బోలేబాబాడెయిరీ లీలలు తెలిశాయి. కల్తీనెయ్యిని సరఫరాచేశారనేది అధికారులు నిర్ధారించేశారు. మరీ ఇప్పుడు బోలేబాబా డెయిరీ భౌహాన్ కోసం వేటాడుతున్నారు. ఆయన పట్టుబడితే మరిన్ని సాక్ష్యాధారాలు సిట్ చేతికి అందినట్లేనని, ఈ కల్తీ పాపంలో కీలక సూత్రధారుల పేర్లు వెలుగుచూసి కల్తీ కేసు క్లైమాక్స్కు చేరుకుంటున్నదనేది సమాచారం.

Read also: TTD : విదేశాల్లో వెంకన్న మందిరాల నిర్మాణానికి కృషి : టీటీడీ ఛైర్మన్

#AdulteratedGhee #BoleBabaDairy #BoleBabaLeak #cbiinvestigation #ChouhanManhunt #DeceitInDevotion #DevoteeBetrayal #FakeGhee #FoodAdulteration #GheeFraud #GheeScam #HarivamOnTheRun #HolyFoodScandal #TempleOfferingsScam #TempleScam #TirumalaLadduScam #TirumalaTemple #TTDControversy #TTDCorruption #ttdscam Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.