📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Thyroid: విజయనగరంలో పెరుగుతున్న థైరాయిడ్‌ కేసులు?

Author Icon By Anusha
Updated: May 25, 2025 • 4:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి విజయనగరం జిల్లాలో థైరాయిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ వ్యాధి లక్షణాల విషయానికొస్తే విపరీతంగా బరువు పెరుగుతున్నా, ఏళ్లుగా పిల్లలు పుట్టకపోయినా, సరిగ్గా నెలసరి రాకపోయినా వైద్యులు సూచించే తొలి పరీక్ష ఇది. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే అవయవాల పనితీరు నెమ్మదిస్తుందని వైద్యులు చెబుతున్నారు. నేడు థైరాయిడ్‌ నివారణ దినం.విజయనగరానికి చెందిన దంపతులకు పెళ్లై ఆరేళ్లు అయినా పిల్లలు పుట్టలేదు. జిల్లాల్లోని పేరున్న అన్ని ఆసుపత్రులు తిరిగారు. ఉద్యోగానికి హైదరాబాద్‌ వెళ్లిన భర్త అక్కడి కార్పొరేటు ఆసుపత్రిలో భార్యకు పరీక్షలు చేయించాడు. అప్పుడు పరీక్షలు నిర్వహించిన తరువాత థైరాయిడ్‌ వ్యాధి(Thyroid Disease) వలన పిల్లలు పుట్టడం లేదనే తెలిసుకుని మందులు వాడగా పండంటి ఆడబిడ్డ జన్మించింది.

పనితీరు

పార్వతీపురం పట్టణానికి చెందిన అరుణ అనే మహిళ కొద్ది కాలంగా బరువు తగ్గిపోతూ తరచూ అనారోగ్య సమస్యలకు గురవుతోంది. బలమైన ఆహారం తింటూ మందులు వాడినుప్పటికీ ఆరోగ్యం కుదుట పడలేదు. ఇటీవల విశాఖలో పరీక్షలు చేయించారు. వైద్యులు హైపర్‌ థైరాయిడ్‌గా నిర్ధారించి మందులు వాడమని సూచించారు.థైరాయిడ్‌ హార్మోను(Thyroid hormone) సవ్యంగా విడుదలైనప్పుడు శరీరంలో ప్రతి కణం సరిగ్గా పని చేసి, జీవక్రియ రేటు సక్రమంగా ఉంటుంది. ఈ గ్రంథి పనితీరు పెరిగినప్పుడు హైపర్‌ థైరాయిడిజం తక్కువగా పని చేస్తున్నప్పుడు హైపో థైరాయిడిజం సమస్యలు వస్తాయి.ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల వైద్యులు, శస్త్రచికిత్సకు అవసరమైన పరికరాలను సమకూర్చడంతో సేవలు అందుతున్నాయి. ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్టు (ఆరోగ్యశ్రీ) పరిధిలోనూ చికిత్స ఉంది.

Thyroid: విజయనగరం జిల్లాలో పెరుగుతున్న థైరాయిడ్‌ కేసులు?

లక్షణాలు, నివారణ

గొంతు వాపు ఎక్కువగా ఉండటం, ఒక్కసారిగా బరువు పెరగడం/తగ్గడం, చిన్నపాటి పనులకే నీరసించిపోవడం,గుండె వేగంగా కొట్టుకోవడం, ప్రతి చిన్న విషయానికి చిరాకు, విసుగు చెందడం అంతేగాక సంసార జీవితంపై ఆసక్తి లేకపోవడం, ఆహారం జీర్ణం కాకపోవడం, మల బద్ధకం వంటి తదితర సమస్యలుంటే వ్యాధి లక్షణాలుగా పరిగణించవచ్చు.ఉల్లిపాయలు, బంగాళా దుంప, సముద్రపు చేపలు తీసుకోవాలి. వీటిలో అయోడిన్‌ శాతం ఎక్కువగా ఉంటుంది.

Read Also: WhatsApp Governance: వాట్సాప్‌లో రేషన్ కార్డు సేవలు

 

#HealthAwareness #ThyroidAwareness #ThyroidDisorders #ThyroidHealth #WorldThyroidDay Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.