Today News : Brahmotsavam – బ్రహ్మోత్సవాలకు సర్వాంగసుందరంగా సిద్ధమవుతున్న ఏడుకొండలు

Read Time:  1 min
Brahmotsavam : బ్రహ్మోత్సవాలకు సర్వాంగసుందరంగా సిద్ధమవుతున్న ఏడుకొండలు
Brahmotsavam : బ్రహ్మోత్సవాలకు సర్వాంగసుందరంగా సిద్ధమవుతున్న ఏడుకొండలు
FONT SIZE
GET APP

Brahmotsavam : ఏడుకొండల శ్రీవేంకటేశ్వరస్వామికి సెప్టెంబర్ 24 నుండి మొదలుకానున్న సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమలలో (Tirumala) ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. తొమ్మిదిరోజులుపాటు జరిగే దేవుని ఉత్సవాలకు దేశవిదేశాల ఉండి అశేషంగా భక్తులు తరలివస్తారనే ముందుచూపుతో అన్ని విధాలా అవసరమైన ఏర్పాట్లు, సౌకర్యాలు, ఆలయ గోపురాలకు రంగులు వేయడం, చక్కగా తీర్చిదిద్దడం, ఆలయం (Temple) ప్రహరీగోడలకు రంగులేసే పనులు మొదలయ్యాయి. ఇంకా మాఢవీధుల్లో గ్యాలరీలు నిర్మాణం, ఆలయానికి ఎదురుగా చలువపందిళ్ళు, జర్మనెడ్లు, ఆస్థాన మండపం వద్ద భక్తులు వానకు తడవకుండా ఉండేలా షెడ్లు నిర్మాణం జరుగుతోంది. మాఢవీధుల్లో ఎండకు. వానకు రక్షణగా గ్యాలరీలు నిర్మితమవుతున్నాయి. ఇంజనీరింగ్ పనులు జోరుగా సాగుతున్నాయిఈ ఏడాది సాలకట్ల బ్రహ్మోత్సవాలు మాత్రమే జరగనున్నాయి. తొమ్మిదిరోజులు వాహనసేవలను భక్తుల మధ్య జరిపించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమవుతోంది. ఆలయం పరిసరాలు, మాఢవీధుల్లో గ్యాలరీలు, ఇనుప పైపులతో నింపేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు కొండను సర్వాంగసుందరంగా ముస్తాబుచేసే పనులు జోరందుకున్నాయి. శ్రీవారి పుష్కరిణి మరమ్మతులు పనులు పూర్తిచేసి నీటిని వదలడంతో బుధవారం సాయంత్రం పుష్కరిణి హారతితో పున:ప్రారంభమైంది.

Brahmotsavam

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/tirumala-with-the-help-of-ai-srivari-darshan-can-be-done/andhra-pradesh/533457/

Shravan

రచయిత గురించి

Shravan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.