📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Minister: ధర్మరక్షణకు పోరాడిన యోధుల చరిత్ర పాఠ్యాంశాల్లో చేర్చాలి: సత్యకుమార్ యాదవ్

Author Icon By Vanipushpa
Updated: June 10, 2025 • 12:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యోధుల చరిత్ర పాఠ్యాంశాల్లో చేర్చే బాధ్యతను ఎన్డీఏ(NDA) ప్రభుత్వం చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్(Minister Satyakumar Yadav) అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట(Jaggaiahpeta) పట్టణంలో బైపాస్ రోడ్డు కూడలివద్ద ప్రధాన రహదారిపై ఏర్పాటుచేసిన ఛత్రపతి శివాజీ మహరాజ్ కాంశ్య విగ్రహావిష్కరణ శోభాయమానంగా జరిగింది. తొలుత హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో పురవీధుల్లో ఛత్రపతికి, భారత మాతకు జేజే ధ్వానాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహిం చారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల నడుమ ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహావిష్కరణ జరిగింది.

Minister: ధర్మరక్షణకు పోరాడిన యోధుల చరిత్ర పాఠ్యాంశాల్లో చేర్చాలి: సత్యకుమార్ యాదవ్

హిందూ సమ్మేళన సభలో పాల్గొన్నారు
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, కెడిసిసి బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్, మాజీవిప్ సామినేని ఉదయభాను, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఆధ్యాత్మికవేత్తలు కమలానంద భారతి స్వామి, శివస్వామి, చిట్టా లక్ష్మీనరసింహశాస్త్రి, మాజీ మున్సిపల్ వైస్చర్మన్ నూకల కుమారరాజ, బిజెపి నేత మన్నె శ్రీనివాసరావు, రాంకో సిమెంట్స్ ప్రెసిడెంట్ ఆధ్యాత్మికవేత్తలు కమలానంద భారతి స్వామి, శివస్వామి, చిట్టా లక్ష్మీనరసింహశాస్త్రి, కుమారరాజు, శ్రీవత్సవ, ఆర్ఎస్ఎస్ భరత్ లు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన హిందూ సమ్మేళన సభలో అతిధులు అద్భుత ప్రసంగాలుచేశారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ కోట్లాదిమంది భారతీయుల ఆశలు, ఆశయాలకు, ధర్మ జీవనం, వీరత్వాలకు ఛత్రపతి శివాజీ మహరాజ్ జీవితం ఆయన పరిపాలన ఒక ఆదర్శం అన్నారు. గత ప్రభుత్వాలు రకరకాల కారణాలతో మన చరిత్రను వక్రీకరించారని, తండ్రిని బంధించి సోదరులను హత్యచేసిన ఔరంగాజేబు గురించి ఘన చరిత్రలా పాఠ్యపుస్తకాల్లో చేర్చి చదివించారని విచారం వ్యక్తపర్చారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన వారి గురించి భావితరాల వారు తెలుసుకునేలా మన చరిత్రను పునర్లిఖించే ప్రయత్నం జరుగుతుం దన్నారు. శాంతి లేకుంటే దేశంలో అభివృద్ధి ఉండదు.
దేశ రక్షణలో మోడీ ఆదర్శం
దేశంలో శాంతిని స్థాపించేందుకు ప్రధాని నరేంద్రమోడి అవిశ్రాంతంగా పరిశ్రమిస్తున్నారు. గత 11 సంవత్సరాల నరేంద్ర మోడి పరిపాలనలో ఉగ్రవాదుల అంతు చూస్తున్న వైనాన్ని మనం చూస్తున్నామన్నారు. దేశ రక్షణలో మన ప్రధాని ప్రపంచ దేశాల వారికి ఆదర్శాన్ని అందించారన్నారు. 2026 నాటికి నక్సలిజం కనుమరు గుతుందన్నారు. మావోయిస్టులు నేడు ప్రాణరక్షణ కోసం ప్రాకులాడు తున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మాట్లాడుతూ జగ్గయ్యపేటకు వచ్చే వారికి తొలుత ఛత్రపతి శివాజీమహరాజ్ విగ్రహం. దర్శనమయ్యేలా ఏర్పాటుచేసుకోవటం అభినందనీయమ న్నారు. కెడిసిసి బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ మాట్లా డుతూ హిందూ ధర్మరక్షకులుగా పోరాటాలు చేసిన యో ధుడు శివాజీని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను. మాట్లాడుతూ ఈరోజు జగ్గయ్యపేట చరిత్రలో లిఖితం అవుతుందన్నారు. ఆధ్యాత్మికవేత్తలు కమలానంద భారతి స్వామి, శివస్వామి మాట్లాడుతూ హిందూ ధర్మాచరణ గొప్పతనం గురించి వివరించారు. రెండు దశాబ్దాల క్రితమే జగ్గయ్యపేటలో దర్శిద్దాం రండి పేరుతో ప్రముఖ తాత్వికులు గెంటేల వెంకటరమణ ఒక మహత్తర కార్యక్రమం చేపట్టి శిధిలావస్థ లోవున్న హిందూ దేవాల యాలను తెరిపించి నిత్యధూపదీప నైవేద్య కైంకర్యాలు జరిగేలా చేశారని గుర్తుచేశారు. కాగా శివాజీ విగ్రహ ఏర్పాటుకు రూ.5 లక్షలకు పైబడి విరాళం అందించిన నూకల కుమారరాజ, విష్ణువర్ధన్లను సభలో ఘనంగా సత్కరించారు. కోర్ కమిటీ సభ్యులను అతిథులు అభినం దించారు. సభా కార్యక్రమాలకు నోముల రఘు అనుసంధానకర్తగా వ్యవహరించారు.

Read Also: AP Congress: ఏపీ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Satyakumar Yadav should be included in the curriculum Telugu News online Telugu News Paper Telugu News Today The history of warriors

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.