📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Terrorists: తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాదుల ఏరివేతకు భారీ అన్వేషణ

Author Icon By Anusha
Updated: May 24, 2025 • 1:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు రాష్ట్రాల్లో టెర్రరిస్టుల స్లీపర్‌ సెల్స్‌పై దృష్టి సారించారు పోలీసులు. ఆపరేషన్‌ స్లీపర్‌ సెల్‌ పేరుతో ఉగ్రమూకల వేట షురూ అయింది. ఈ నేపథ్యంలో విశ్వనగరం హైదరాబాద్‌లో ఉగ్ర జాడలు కనిపించడం కలకలం రేపుతోంది. కలవరం కలిగిస్తోంది. కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్‌ బోయగూడలో ఉగ్రవాద ఆనవాళ్లు బయటపడం ఆందోళన కలిగిస్తోంది. నిత్యం తమ మధ్యే ఉండే యువకుడు బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్టు తెలియగానే బస్తీవాసులు ఆందోళనకు గురయ్యారు. విజయనగరంలో బాంబు పేలుళ్లకు రిహార్సల్స్‌ కోసం అంతా సిద్ధం చేసిన అక్కడి యువకుడు సిరాజ్, బోయగూడకు చెందిన సయ్యద్‌ సమీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసును NIA డీల్ చేస్తోంది.

కదలికలను

ఇక లేటెస్టుగా తెలంగాణ డీజీపీ జితేందర్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం, హైదరాబాద్‌లో భారీ సంఖ్యలో ఉగ్రవాద స్లీపర్ సెల్స్(Sleeper cells) ఉన్నాయన్న అనుమానాలకు తావిస్తోంది. హైదరాబాద్‌లో స్లీపర్‌ సెల్స్‌ను గుర్తిస్తున్నామని, వారికి కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామని డీజీపీ చెప్పారు. నగరంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పూర్తి అలర్ట్‌గా ఉన్నాయన్నారు జితేందర్‌ . నిఘా వర్గాల హెచ్చరికలతో స్లీపర్ సెల్స్ కదలికలపై ఆరా తీస్తున్నామన్నారు ఆయన. ఇక స్లీపర్‌ సెల్స్‌ జాడ పసిగట్టి, వాళ్ల పని పట్టేందుకు స్పెషల్‌ యూనిట్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఉగ్రవాదుల కదలికలను ముందుగానే గమనించి అనేక మంది నిందితులను అరెస్టు చేశామని డీజీపీ తెలిపారు. ఇక సమీర్, సిరాజ్‌లు ఉగ్రకుట్రకు ఒక గ్రూప్‌ ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారని, ఏర్పాటు దశలోనే గ్రూపును కనిపెట్టి విచ్ఛిన్నం చేశామన్నారు(DGP Jitender) డీజీపీ జితేందర్‌.

Terrorists: తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాదుల ఏరివేతకు భారీ అన్వేషణ

కమాండర్లు

టెర్రర్‌ స్లీపర్ సెల్స్ అనేవి, జనం మధ్య గుట్టుచప్పుడు కాకుండా పనిచేసే ఉగ్రవాదుల గ్రూపులు లేదా ఉగ్రవాద సానుభూతి పరులు. వీళ్లు చాప కింద నీరులా పనిచేస్తారు. టెర్రర్‌ గ్రూపు కమాండర్లు ఆదేశించిన వెంటనే, ఈ స్లీపర్‌ సెల్స్‌ యాక్టివేట్‌ అవుతాయి. వీళ్లు గోప్యంగా పనిచేస్తూ, నిఘా వ్యవస్థల కంట పడకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు. స్లీపర్ సెల్స్‌పై నిఘా ఉంచడం ద్వారా, హైదరాబాద్ నగరాన్ని సురక్షితంగా ఉంచేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెంచుతున్నారు.

Read Also: Nikita Dutta: ప్రముఖ నటి నికితా దత్తాకు కరోనా

#HighAlert #TeluguStates #OperationSleeperCells Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.