Cyclonic Storm Arnab : అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలంగాణ విద్యుత్ శాఖ సహాయాన్ని కోరారు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు అవసరమైన సిబ్బంది, సామగ్రిని అందించాలని విజ్ఞప్తి చేశారు.
విట్టు నాయక్ తండాలో ఆకస్మిక తనిఖీలు
ఏపీ మంత్రి విజ్ఞప్తిపై తెలంగాణ విద్యుత్ శాఖ సానుకూలంగా స్పందించింది. విద్యుత్ పునరుద్ధరణ పనుల కోసం అవసరమైన సిబ్బంది, సామగ్రిని ఆంధ్రప్రదేశ్‌కు పంపేందుకు అంగీకరించింది. తుఫాన్ కారణంగా విద్యుత్ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతు పనులను వేగవంతం చేయడానికి ఈ సహకారం ఉపయోగపడనుంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు త్వరగా ఉపశమనం కలిగించడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :