తిరుమల : ప్రసాదాల నాణ్యత మెరుగుపరిచి దేవునికి నివేదించే నైవేద్యాలను దిట్టంప్రకారం పాతరోజుల్లాగా గంగాళాల్లో స్వామివారిచెంత నివేదిస్తున్నారు. ఇవంతా నాణ్యతగా ఉండేలా టిటిడి (TTD) ఛైర్మన్ బిఆర్నాయుడు, ఇఒ శ్యామలరావు, అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇప్పుడు ఇందులో భాగంగా నైవేద్యప్రసాదాల తయారీకి వినియోగించే పరుకులు నాణ్యతగా ఉండాలని చూస్తున్నారు. ఇందుకోసం సరఫరా అయిన ఆహారపదార్థాల సరుకులు ఎంతవరకు నాణ్యత ఉన్నాయని తెలుసుకునేందుకు టిటిడి అధికారులు ఇటీవల 30లక్షలు రూపాయలు విలువచేసే రెండు యంత్రాలనుకోయంబత్తూరునుండి తెప్పించారు. ఈ యంత్రాలను ఆలయానికి వెనుకవైపు సరు కులు నిల్వ ఉంచే గోదాములో ఏర్పాటుచేశారు. పప్పుదినుసులు, బియ్యం, జీడిపప్పు, చక్కెర, బాదం, ఎండుద్రాక్ష తదితర వాటిని కల్తీ ఉందా లేదా అని తెలుసుకోవడానికి యంత్రాలు (Machines) ఉపయోగపడుతున్నాయి.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ MORE :