📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Tangirala Soumya: లాసెట్ రాసిన నందిగామ ఎమ్మెల్యే సౌమ్య

Author Icon By Anusha
Updated: June 6, 2025 • 3:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీలో గురువారం జరిగిన లాసెట్ (లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 188 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు.అయితే లాసెట్ పరీక్షను ఏపీ ప్రభుత్వ విప్, నందిగామ టీడీపీ మహిళా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విజయవాడ కండ్రికలోని సెంటర్‌లో రాశారు. పాలనకు చట్టాలపై అవగాహన ఉంటే తోడ్పాటుగా ఉంటుందని తంగిరాల సౌమ్య(Tangirala Soumya) అభిప్రాయపడ్డారు అన్నారు. తన తండ్రి తంగిరాల ప్రభాకరరావు లాయర్‌గా పేదలకు సేవలందించారని గుర్తు చేశారు. తన కూడా ఆయన బాటలో, ఆయన స్ఫూర్తితో న్యాయశాస్త్రం చదవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అందుకే లాసెట్ పరీక్ష రాశానన్నారు. వాస్తవానికి తంగిరాల సౌమ్య బీటెక్‌ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కూడా చేశారు. తండ్రి తంగిరాల ప్రభాకరరావు ఆకస్మిక మరణంతో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు.

న్యాయశాస్త్రం

తంగిరాల సౌమ్య మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు కూడా లాసెట్‌ పరీక్ష రాశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరు సమీపంలోని రైజ్‌ కాలేజీ సెంటర్‌లో పరీక్షకు హాజరయ్యారు. ‘లాయర్‌గా ప్రాక్టీస్‌ చేయడం కంటే కూడా న్యాయశాస్త్రం చదవాలనే ఆసక్తితో లాసెట్‌ రాశాను న్యాయశాస్త్రంలో నాకు తెలియని సెక్షన్లు చాలా ఉన్నాయి. నేను వాటిని తెలుసుకునేందుకు న్యాయ విద్య అభ్యసిస్తాను’ అన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు(AB Venkateswara Rao)పై గత ప్రభుత్వంలో నమోదైన కేసుల్లో కూడా ఆయనే స్వయంగా కోర్టులో వాదనలను వినిపించారు. ఇప్పుడు లా చదివేందుకు సిద్ధమయ్యారు.

Tangirala Soumya: లాసెట్ రాసిన నందిగామ ఎమ్మెల్యే సౌమ్య

ప్రవేశ పరీక్ష

ఏపీ న్యాయ విద్యలో ప్రవేశం కోసం లా కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్ (ఏపీ లాసెట్‌, పీజీఎల్‌సెట్-2025) నిర్వహించారు. 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 3 ఏళ్ల LLB, 5 ఏళ్ల LLB, 2 ఏళ్ల LLM పీజీ కోర్సుల్లో ప్రవేశాలు ఉంటాయి. ఈ ఏడాది లాసెట్‌ ప్రవేశ పరీక్షను పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిర్వహించింది. గురువారం (జూన్ 5) ఉదయం 9 గంటల నుంచి 10.30 గంల వరకు ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్ష నిర్వహించారు. జూన్‌ 16న తుది కీ, జూన్ చివరి వారంలో లాసెట్ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Read Also: Drugs: విజయవాడ బైక్ లో పట్టుబడ్డ డ్రగ్స్

#APLAWCET2025 #LawEntranceExam #TangiralaSoumya #VijayawadaNews Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.