📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Talliki Vandanam Scheme : తల్లికి వందనంలో చేతికందేది 2వేలే

Author Icon By Anusha
Updated: June 12, 2025 • 12:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకం నిధుల్ని విడుదల చేస్తోంది ప్రభుత్వం. 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని ప్రకటించింది. మొత్తం 67,27,164 మంది విద్యార్థుల తల్లులకు రూ.8,745 కోట్లు జమ చేయనున్నారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఒక్కొక్కరికీ రూ.15 వేల చొప్పున సాయం అంజేస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం(Talliki Vandanam Scheme) అమలుకు సంబంధించి విడుదల చేసిన జీవోలో మాత్రం రూ.15వేలు కాకుండా రూ.13వేలు మాత్రమే ఇస్తున్నట్లు తెలిపింది.

అమ్మ ఒడి

తల్లికి వందనం రూ.15వేల నుంచి తీసుకున్న రూ.2వేలను పాఠశాలల అభివృద్ధితో పాటు నిర్వహణకు కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఈ నిధులు ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో ఉండే అకౌంట్‌లకు జమ చేస్తారని తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో కూడా అమ్మ ఒడి కింద రూ.15వేలు అందజేశారు. అప్పుడు కూడా ఈ రూ.15వేలలో పాఠశాల నిర్వహణ కోసం రూ.వెయ్యి, మరుగుదొడ్ల నిర్వహణ నిధికి రూ.1,000, చొప్పున మినహాయించి మిగిలిన రూ.13వేలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం కూడా అదే ఫాలో అయ్యింది.ఒక్కొక్కరికి రూ.13వేల చొప్పున ఇవ్వబోతోంది.

మార్గదర్శకాలు జారీ

తల్లికి వందన పథకానికి సంబంధించి మార్గదర్శకాలను కూడా జీవోలో పొందుపరిచారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి మార్గదర్శకాలను కూడా జీవోలో పొందుపరిచారు.పట్టణ ప్రాంతాల్లో రూ.12వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు లోపు ఆదాయం ఉన్నవాళ్లే ఈ పథకానికి అర్హులు. కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి పేరు రేషన్ కార్డులో కచ్చితంగా ఉండాలి.మాగాణి మూడు ఎకరాలలోపు, మెట్ట 10 ఎకరాలలోపు రెండు కలిపి 10 ఎకరాలలోపు ఉన్నవాళ్లే అర్హులు. నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు, ట్రాక్టర్, ట్యాక్సీ, ఆటోకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. నెలకు విద్యుత్ వాడకం ఏడాదికి సగటున 300 యూనిట్లు మించకూడదు.పట్టణాలు, నగరాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించి ఆస్తి ఉండకూడదు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ పథకానికి అనర్హులు. పింఛన్‌ (రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి) తీసుకునేవారు అనర్హులు. పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేల లోపు ఆదాయం ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు. ఐటీ (ఇన్‌కమ్ ట్యాక్స్) ఫైల్ చేసేవారికి ఈ పథకం వర్తించదు.

Talliki Vandanam Scheme

అవకాశం కల్పిస్తామని

ముఖ్యమంత్రి చంద్రబాబు  తల్లికి వందనం పథకంపై సమీక్ష చేశారు. అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ఆదేశించారు. నిధుల కొరత రాకుండా చూడాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌(Payyavula Keshav)కు సూచించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. అంతేకాదు ఒకవేళ సాంకేతిక సమస్యల కారణంగా ఎవరి పేర్లు అయినా రాకపోతే మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది. తల్లికి వందన పథకంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ‘విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు. అందరికీ గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళా మణులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నాం’ అన్నారు.

అద్భుతమైన వాతావరణం

నేటి నుంచి స్కూల్స్ ప్రారంభమవుతున్న సందర్భంగా మంత్రి లోకేష్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆడుతూ, పాడుతూ చదువుకునేందుకు అద్భుతమైన వాతావరణం. ఆకలి వేసే మధ్యాహ్నానికి ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’ ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం. విద్యా సంవత్సరం బడి గంట మోగేసరికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం ద్వారా విద్యార్థులందరికీ సరికొత్త యూనిఫామ్, పుస్తకాలు, షూ, బెల్ట్, బ్యాగు అందజేస్తున్నాం. తల్లికి వందనం పథకం ఆరంభిస్తున్నాం,అంటూ ట్వీట్ చేశారు.

Read Also: YOGA: 2 వేల మందితో ‘కృష్ణా యోగా’

#EducationWelfare #SchoolDevelopment #StudentSupport #TalliKiVandanam Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.