Swarna Grama Ward Sachivalayam: సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే

Read Time:  1 min
Swarna Grama Ward Sachivalayam: సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
FONT SIZE
GET APP

Swarna Grama Ward Sachivalayam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్వర్ణ గ్రామ మరియు స్వర్ణ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జవాబుదారీతనం పెంచేందుకు ప్రభుత్వం హాజరు నిబంధనలను కఠినతరం చేసింది. పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యంగా ‘ఫేసియల్ రికగ్నిషన్’ (Facial Recognition) హాజరు విధానంలో మార్పులు చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: Cricketer Deepika: అంధ క్రికెటర్ దీపికకు అండగా నిలిచిన ఎమ్మెల్యే

సమయపాలన – కొత్త నిబంధనలు

తాజా హాజరు నిబంధనల ప్రకారం.. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇకపై తప్పనిసరిగా ఉదయం 10 గంటల 30 నిమిషాల లోపు ఫేసియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. పది నిమిషాల గ్రేస్ టైమ్ అవకాశం కల్పించారు. దీంతో పది గంటల 40 నిమిషాలలోపు హాజరు నమోదు చేయాలి.ఉద్యోగులు 10 గంటల 40 నిమిషాల తర్వాత అటెండెన్స్ నమోదు చేస్తే.. ఆలస్యంగా గుర్తించి సెలవుగా పరిగణిస్తారు.

Swarna Grama Ward Sachivalayam: Alert to Secretariat employees: These are the new attendance rules
Swarna Grama Ward Sachivalayam: Alert to Secretariat employees: These are the new attendance rules

ఉద్యోగులు ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వలన ఉదయం 10 గంటల 40 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల మధ్య హాజరు నమోదు చేయాల్సి వస్తే.. సచివాలయాల డీడీవో ముందస్తు అనుమతి తీసుకోవాలి. నెలకు కేవలం మూడు సార్లు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అనుమతి తీసుకోకపోయినా, మూడుసార్లు పూర్తి అయిన ఉద్యోగులు.. ఉదయం 10 గంటల 40 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల మధ్య హాజరు నమోదుచేస్తే.. హాఫ్ డే లీవ్‌గా పరిగణిస్తారు. అలాగే 11 గంటల 30 నిమిషాల నుంచి 2 గంటల మధ్య హాజరు నమోదు చేస్తే హాఫ్ డే లీవ్‌గా పరిగణిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.